Sania Mirza: ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి సానియా మీర్జా ఈ ఏడాది విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ అయినటువంటి షోయబ్ మాలిక్ ని పెళ్లాడింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా షోయబ్ మాలిక్ పాకిస్తాన్ బుల్లితెర నటి సోనా జావేద్ తో ప్రేమలో ఉన్నారని కొన్ని వార్తలు మీడియాలో వినిపించాయి.కానీ అవన్నీ పుకార్లే అనుకున్నప్పటికీ అనూహ్యంగా సనా జావేద్ ని షోయబ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడేసరికి నిజంగానే సానియా తన భర్తకు విడాకులు ఇచ్చేసిందని అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.
Sania Mirza marriage with an Indian cricketer
ఇక సానియా మీర్జా విడాకులు షోయబ్ మాలిక్ మూడో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో సానియామీర్జా షోయబ్ కి విడాకులు ఇచ్చిన విషయం నిజమేనని చెప్పింది. ఇదంతా పక్కన పెడితే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడంతో సానియా మీర్జా కూడా రెండో పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే ఎంతోమంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.(Sania Mirza )
Also Read: Priyanka Chopra: మూత పడబోతున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా రెస్టారెంట్.. కారణం ఇదే..!
ఈ నేపథ్యంలోనే ఈమె రెండో పెళ్లి చేసుకోబోయేది వారినే అంటూ వీరినే అంటూ ఎన్నో రూమర్స్ కూడా మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గత కొద్ది రోజుల నుండి ఓ రూమర్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే..ఇండియన్ క్రికెటర్ అయినటువంటి మహమ్మద్ షమీని సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతుందని,అయితే మహమ్మద్ షమీ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఈయన కూడా ఒంటరిగానే ఉంటున్నారు.
అయితే అటు సానియా ఇటు షమీ ఇద్దరు విడాకులు తీసుకున్నారు కాబట్టి ఇద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే ఈ రూమర్ పై తాజాగా సానియా మీర్జా తండ్రి స్పందిస్తూ..నా కూతురు మహమ్మద్ షమీ ని పెళ్లి చేసుకోబోతున్న రూమర్ లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటి వరకు నా కూతురు షమీ మొహాన్ని స్వయంగా ఎప్పుడూ చూసింది లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకండి అంటూ క్లారిటీ ఇచ్చారు.(Sania Mirza )