Sanjiv Goenka: కేఎల్ రాహుల్.. స్వార్థపరుడు..నమ్మక ద్రోహి అంటూ లక్నో యజమాని సంజీవ్ గొనెంకా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అన్ని జట్లు వారు రిటైన్ చేసిన ఆటగాళ్ల పేర్లను అనౌన్స్ చేశాయి. దీని ప్రకారం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మెగా వేలానికి ముందు మొత్తం ఐదు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లు మరియు ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. Sanjiv Goenka
Sanjiv Goenka slams kl rahul
కానీ ఈ జాబితాలో ఆ జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ లేడు. అంటే రాహుల్ లక్నో జట్టుకు దూరమైనట్లేనని వార్తలు వస్తున్నాయి. అతను మెగా వేలంలో కనిపించనున్నాడు. కాగా రాహుల్ ను ఆ జట్టు నుంచి తప్పించిన లక్నో యజమాని ఆ తర్వాత రాహుల్ పేరును ప్రస్తావించకుండా సంచలన కామెంట్స్ చేశాడు. నిజానికి గత మూడు ఎడిషన్లలో కేఎల్ రాహుల్ లక్నోకు కెప్టెన్ గా ఉన్నాడు. Sanjiv Goenka
Also Read: BRS: ఇప్పుడు ఎన్నికలు వస్తే.. బీఆర్‌ఎస్ పార్టీకి 100 సీట్లు పక్కా ?
ఈ వ్యవధిలో లక్నో రెండుసార్లు టైటిల్ గెలుచుకోలేకపోయింది. అయితే గత సీజన్లో జట్టు పేలవ ప్రదర్శనను కనబరిచింది. ఆడిన 14 మ్యాచులలో ఏడింటిలో ఓడి ఏడవ స్థానంలో నిలబడింది. దీంతో జట్టు కెప్టెన్ గా రాహుల్ నుంచి తప్పించాలని లక్నో యజమాని సంజీవ్ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారుతుంది. Sanjiv Goenka