Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ విషయంలో ఇంత పెద్ద వివాదం ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తూ, తమిళనాడు NTK పార్టీ అధినేత సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, లడ్డూ ప్రసాదం తిని ఎవరూ చనిపోలేదని, కల్తీ జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు.
Seeman Controversial Comments on the Tirumala Laddu Issue
సీమాన్ మాట్లాడుతూ, దేశంలో అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయని, ప్రజలు వాటితో నిత్యం బిజీగా ఉన్నారని చెప్పారు. అధిక ధరలతో జనాలు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, ఈ తరుణంలో లడ్డూ, బూందీ వంటి విషయాలపై ఎందుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. లడ్డూ తప్పా దేశంలో మరేదైనా సమస్యలున్నాయా అని నిలదీశారు.
Also Read: Rohit Sharma: విరాట్ కోహ్లి మీద చిరకుపడ్డ రోహిత్.. బంగ్లా మ్యాచ్ లో విడ్డూరం!!
తిరుమల లడ్డూ అంశాన్ని కావాలనే వివాదం చేస్తున్నారని, దీని ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని సీమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ద్వారా మిగతా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సీమాన్, ప్రభుత్వాలు మరియు ప్రజలు దేశంలో ఉన్న నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. లడ్డూ వంటి చిన్న విషయాలపై కాకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని హితవు పలికారు.