Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన నటనా జీవితం గురించి మనసు విప్పి మాట్లాడారు. 36 సంవత్సరాల క్రితం, 23 ఏళ్ల వయసులో నటనారంగంలో అడుగుపెట్టి, 27 ఏళ్లకల్లా హీరోగా స్థిరపడ్డాను అని ఆయన తెలిపారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, విజయాలు, పరాజయాలు చవిచూశానని, జీవితంలో ఆశించినదానికంటే ఎక్కువ సాధించానని ప్రకటించారు.
Shah Rukh Khan Shares Heartfelt Gratitude for His Fans
తాను కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నానని, వారి ప్రేమాభిమానాలు తనకు అండగా నిలుస్తున్నాయని షారుక్ ఖాన్ చెప్పారు. భగవంతుడు తనకు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించాడని, అందుకు ఆయనకు రుణపడి ఉన్నానని కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Salman Khan: సల్మాన్ – బిష్ణోయ్ వివాదం.. రంగంలోకి సల్మాన్ తండ్రి.. అంతటా ఉత్కంఠ!!
అయితే, తన మనసులో ఇంకా ఒక కోరిక మిగిలి ఉందని ఆయన చెప్పారు. షూటింగ్ లొకేషన్‌లో నటిస్తూనే తనువు చాలించాలని ఆయన ఆకాంక్షించారు. “యాక్షన్!” అనగానే నటిస్తూ ఉండగానే కుప్పకూలాలని, “కట్!” అన్నా లేవకూడదని షారుక్ భావోద్వేగంతో తెలిపారు. ఈ మాటలు ఆయన నటన పట్ల ఎంతటి అంకితభావం కలిగి ఉన్నారో తెలియజేస్తున్నాయి.
ఇటీవల ఆయన నటించిన ‘జవాన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం, ఆయన ‘డంకీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. షారుక్ ఖాన్ అభిమానం పట్ల చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన అభిమానులను ఎంతగానో కదిలించాయి.