Abhishek Bachchan: బచ్చన్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. ప్రస్తుతం ఇదే న్యూస్ బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారుతుంది.గత కొద్ది రోజులుగా ఐశ్వర్య రాయ్ తో గొడవలు వస్తున్నాయి అని, ఐశ్వర్య ఇంటిని వదిలేసి కూతురితో పాటు వేరే ఇంట్లో కాపురం పెట్టింది అని ఎన్నో వార్తలు మీడియాలో వినిపిస్తున్న వేళ రీసెంట్గా ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ తో కలిసి కూతురుతో ఇంటికి చేరింది. ఇలా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య గురించి రోజుకొక వార్త బీటౌన్ లో వినిపిస్తున్న వేళ బచ్చన్ ఫ్యామిలీలో అసలైన విలన్ ఆమెనే అంటూ బాలీవుడ్ మీడియాలో ఒక వార్త సంచలనంగా మారింది.
She is the real villain of Aishwarya fight with Abhishek Bachchan
ఇక ఆమె ఎవరో కాదు అభిషేక్ బచ్చన్ తల్లి అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ అన్నట్టు తెలుస్తుంది.జయా బచ్చన్ మాట తీరు వల్లే ఐశ్వర్యతో గొడవలు వస్తున్నాయట. ముఖ్యంగా జయా బచ్చన్ అన్ని విషయాల్లో నా మాటే నడవాలి.. నా మాటే చెల్లాలి అంటూ పదేపదే మాట్లాడడంతో విసిగిపోయిన ఐశ్వర్య ఇంటి నుండి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక ఐశ్వర్య మాత్రమే కాదు అభిషేక్ బచ్చన్ తో ఎంగేజ్మెంట్ అయ్యాక కరిష్మా కపూర్ ఆయనతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం కూడా జయా బచ్చన్ అని తెలుస్తోంది. (Abhishek Bachchan)
Also Read: Heroine: పెళ్లి కాకుండానే తల్లి అవ్వాలనుకుంటున్న హీరోయిన్.. హీరో ఒప్పుకుంటాడా
ఎంగేజ్మెంట్ అయ్యాక కరిష్మా కపూర్ తనకు కాబోయే అత్త జయా బచ్చన్ ని చూసి భయపడి పోయిందట. ఆమె కఠినమైన మాట, డామినేషన్ చేస్తూ మాట్లాడడం కరిష్మా కి నచ్చలేదట.అంతేకాదు పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లయిన తర్వాత నేను ఇంకా ఎంత టార్చర్ అనుభవించాలోనని ముందుగానే అభిషేక్ బచ్చన్ కి చెప్పి పెళ్లయ్యాక మనం వేరు కాపురం పెడదామని చెప్పిందట.
కానీ అభిషేక్ బచ్చన్ మాత్రం కుటుంబాన్ని ముక్కలు చేసి వేరు కాపురం పెట్టేదే లేదు అంటూ కరాకండిగా చెప్పడంతో ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అలా జయా బచ్చన్ కారణంగా అటు కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ కి దూరమైంది. అలాగే భార్యతో అభిషేక్ బచ్చన్ గొడవలకి కారణం తల్లే అని తెలుస్తుంది.(Abhishek Bachchan)