Shikhar Dhawan: శిఖర్ ధావన్ ఆగస్టు 24 శనివారం అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో గబ్బర్ 14 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కు తెరపడింది. ఈ 14 ఏళ్లలో ధావన్ భారత్ తరపున అద్భుతంగా ఆడడంతో పాటు భారీగా డబ్బులను సంపాదించాడు. Shikhar Dhawan
Shikhar Dhawan highest property in team india
2024లో $19 మిలియన్ల నికర విలువతో భారతదేశంలోనే టాప్-10వ స్థానంలో ఉన్నారు. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం శిఖర్ ధావన్ దాదాపు 142 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి ధావన్ ఆదాయం ఎవరికి తక్కువ కాదని తెలుస్తోంది. Shikhar Dhawan
Also Read: KL Rahul: క్రికెట్ కు రాహుల్ గుడ్ బై.. కొత్త వ్యాపారంలోకి జంప్ …?
శిఖర్ ధావన్ జియో, నేరోలాక్ పెయింట్స్, లేస్, ఒప్పో, బోట్ వంటి అనేక పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్లకు ఎండార్స్మెంట్ చేశాడు. బీసీసీఐ జీతం కూడా అతని సంపాదనలో ఒక ముఖ్యమైన భాగం కావడం విశేషం. అయితే శిఖర్ ఐపీఎల్ ద్వారా కూడా తన కెరీర్ లో అత్యధిక డబ్బులను సంపాదించాడు. శిఖర్ ధావన్ 2008 నుంచి ఐపీఎల్ లో ఆడడం ప్రారంభించాడు. Shikhar Dhawan
శిఖర్ ధావన్ ను 2018లో, 5.20 కోట్ల రూపాయల ధరతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. తర్వాత అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు, అక్కడ అతను 2019 నుండి 2021 వరకు అదే ధర 5.20 కోట్ల రూపాయలను కొనసాగించాడు. మొత్తం ఐపీఎల్ 16 సీజన్లలో శిఖర్ ధావన్ మొత్తంగా 91.8 కోట్ల రూపాయలను సంపాదించాడు. Shikhar Dhawan