Shiva Balaji divorce from his wife

Shiva Balaji: ఏంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ఈ నటుడు నిజంగానే తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడా.. ఇంతకీ శివబాలాజీ విడాకుల మ్యాటర్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో స్టార్ట్ అయిన మొదట్లో బిగ్బాస్ 1 టైటిల్ విన్నర్ అయినటువంటి శివ బాలాజీ అంటే అందరికీ తెలిసిన నటుడే. ఈయన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి శివబాలాజీ నటి మధుమితని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

Shiva Balaji divorce from his wife

.అయితే వీరు ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఇరుకుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పగా శివబాలాజీ పేరెంట్స్ జాతకాలు కలవలేదని పెళ్లికి ఒప్పుకోలేదట. అయితే ఇదే విషయాన్ని మధుమితకి శివబాలాజీ చెప్పగా ఈ రోజుల్లో ఈ జాతకాలు ఏంటి అని దాదాపు సంవత్సరం పాటు శివబాలాజీని దూరం పెట్టి మాట్లాడలేదట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న శివబాలాజీ ఓ రోజు నేరుగా తన ఫోన్ కి ఈ జీవితంలో నేను ఎప్పుడు విడిచిపెట్టను అని మెసేజ్ పెట్టారట. (Shiva Balaji)

Also Read: Nagarjuna: లవర్ కారణంగా టార్చర్ అనుభవించిన నాగార్జున..?

ఇక మెసేజ్ కి కరిగిపోయిన మధుమిత ఇద్దరూ కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లయ్యాక కూడా వీరిద్దరి మధ్య ఎన్నో గొడవలు వచ్చాయట. ముఖ్యంగా మొదటి బాబు పుట్టిన సమయంలో చిన్నచిన్న గొడవల కారణంగా మధుమిత పుట్టింటికి వెళ్ళగా శివబాలాజీ తన కజిన్స్ దగ్గరికి వెళ్లారట.

Shiva Balaji divorce from his wife

అయితే ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్న సమయంలో ఓసారి శివ బాలాజీ మధుమిత దూరంగా ఉన్నారనే విషయం తెలుసుకున్న శివ బాలాజీ కజిన్స్ నువ్వు మధుమిత ఇంటికి వెళ్లి ఆమెని తీసుకురమ్మని చెప్పడంతో మధుమితకు ఫోన్ చేసిన శివబాలాజీ నువ్వు మా ఇంటికి వచ్చి సారీ చెబుతానే వస్తాను అని తెగేసి చెప్పిందట మధుమిత. దాంతో చేసేదేమీ లేక శివ బాలాజీ మధుమిత ఇంటికి వెళ్లారట.ఇంటికి వెళ్ళాక సారీ చెప్పకుండానే శివ బాలాజీ తో కలిసి వచ్చేసిందట మధు.అలా దాదాపు వీళ్ళిద్దరు విడాకుల వరకు వెళ్లి మళ్లీ కలిసారంటూ ఓ ఇంటర్వ్యూలో మధుమిత చెప్పుకొచ్చింది.(Shiva Balaji)