Shivani Rajashekhar who is enjoying in America with her boyfriend

Shivani Rajashekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది పూర్వకాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగా ఫ్యామిలీ, నందమూరి, ఫ్యామిలీ, అక్కినేని, అల్లు ఫ్యామిలీ, అని చెప్పవచ్చు. అయితే ఈ ప్లేస్ లోకి నటుడు రాజశేఖర్ కూడా వచ్చి పడ్డాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో యాంగ్రీ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు రాజశేఖర్. ఈయన సినిమాలు థియేటర్లోకి వచ్చాయంటే జనాలు పోటెత్తేవారు. అలా రాజశేఖర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి.

Shivani Rajashekhar who is enjoying in America with her boyfriend

ఆయన చిత్రాల్లో ఇప్పటికి కొన్ని చిత్రాలు చూస్తే మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఆ విధంగా నటన, డైలాగ్ డెలివరీతో ఎంతో అద్భుతంగా నటించే రాజశేఖర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే కొన్ని కథల విషయంలో చేసిన మిస్టేక్స్ వల్ల డల్ అయిపోయారు. అలా చివరికి అవకాశాలు పూర్తిగా దూరమైపోయాయి. అలాంటి రాజశేఖర్ నట వారసులుగా తన ఇద్దరు కూతుర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఒకరు శివాత్మిక మరొకరు శివాని. ఇద్దరు హీరోయిన్లుగా ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నారు. (Shivani Rajashekhar)

Also Read: Anushka: సన్యాసి అవ్వాలనుకున్న అనుష్క.. కానీ ఆ హీరోయిన్ భర్త వల్ల..?

ఇందులో శివాని రాజశేఖర్ మంచి గుర్తింపుతో దూసుకుపోతుంటే శివాత్మిక నెమ్మదిగా ముందుకు వెళ్తోంది. శివాని రాజశేఖర్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో కోటబొమ్మాలి పిఎస్, అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ, శేఖర్, విద్యవాసుల అహం వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో చాలా సినిమాలు హిట్ అవ్వడంతో ఆమె పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇలా కెరియర్ లో దూసుకుపోతున్నటువంటి శివాని రాజశేఖర్ నటుడు రాహుల్ విజయ్ తో లవ్ లో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

Shivani Rajashekhar who is enjoying in America with her boyfriend

వీరిద్దరి కాంబినేషన్ లో విద్యా వాసుల అహం, కోటబొమ్మాలి పిఎస్ వంటి చిత్రాలు వచ్చాయి. ఇలా వరుసినిమాల్లో వీరు నటించడం వల్ల వీరి మధ్య లవ్ ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా తాజాగా శివాని రాహుల్ తో కలిసి అమెరికా వెకేషన్ వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. వీరిద్దరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె పంచుకోవడంతో వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం తేటాతెల్లమైంది. మరి చూడాలి ఇది ఫ్రెండ్షిప్ గా ముగుస్తుందా, లేదంటే ప్రేమగా ముందుకు వెళ్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Shivani Rajashekhar)