Allu Arjun: అల్లు అర్జున్ ని నువ్వేమైనా పెద్ద తోపా అని అవమానించింది ఎవరు? ఎందుకు అల్లు అర్జున్ ని అంత పెద్ద మాట అన్నారు.. అంత పెద్ద హీరో అయినా అల్లు అర్జున్ ని ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అర్జున్ ని నువ్వేమైనా తోపా అని మాట్లాడింది ఎవరో కాదు తమిళ అభిమానులు.. ఇక ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే..
Shocking comments on Allu Arjun
గతంలో తమిళ్ తలైవాస్ అనే ప్రో కబడ్డీ టీం కి బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్, రామ్ చరణ్ లను తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ నియమించారు.అయితే తమిళ్ తలైవాస్ దీన్ని భారీ ఎత్తున ప్రమోట్ చేస్తూ ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు ఈ ముగ్గురు హీరోలు. అయితే ఆ ఈవెంట్ లో స్టేజ్ పై కూర్చున్న సమయంలో రాంచరణ్ సైలెంట్ గానే కూర్చున్నారు. (Allu Arjun)
Also Read: Nithiin: నోరు మూసుకో లేదంటే నీ అంతు చూస్తా.. నితిన్ కి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్.?
అలాగే కమల్ హాసన్ కూడా పద్ధతిగా కూర్చున్నారు.కానీ అల్లు అర్జున్ మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంతో ఇది చూసిన తమిళ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేక పోయారు. ఇక తమిళ ప్రజలకు భాషా, ప్రాంతీయ భావం అనేది ఎక్కువగా ఉంటుంది.వాళ్ల రాష్ట్రం వారిని ఎవరైనా తక్కువ చేసి చూస్తే అస్సలు ఓర్చుకోలేరు.
అలా ఆరోజు అల్లు అర్జున్ కమల్ హాసన్ ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడంతో మీడియాలో ఆయనపై ట్రోల్స్ చేశారు.అంతేకాదు నువ్వేమైనా పెద్ద పుడింగివా..అంత పెద్ద హీరోనే పద్ధతిగా కూర్చుంటే ఆయన ముందు నువ్వేమో కాలు మీద కాలు వేసుకొని పొగరుగా కూర్చున్నావు అంటూ ఆయనపై విమర్శలు చేశారు. అలా అల్లు అర్జున్ తమిళ ప్రేక్షకుల కోపానికి బలయ్యారు.(Allu Arjun)