Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక తన డబ్బంతా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నారని, ప్రజాసేవకే ఆయన అంకితం అవుతున్నారని ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ చేసే దానాలన్నీ మీడియాలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే వరద బాధితులకు కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కొండగట్టులో భక్తులు ఉండడం కోసం వంద గదులు కూడా నిర్మిస్తున్నారు.
Should Pawan Kalyan children not get property
ఇవే కాకుండా ఇంకా ఎన్నో సహాయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇచ్చే విరాళాలు చూసి సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి ఆయన నలుగురు పిల్లల ఫోటోలను పెట్టి చాలామంది మీమర్స్,ట్రోలర్స్ సోషల్ మీడియా లో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలాగే విరాళాలు ఇచ్చుకుంటూ పోతారు..(Pawan Kalyan)
Also Read: Adivi Sesh: ఆ హీరోయిన్ తో గొడవలు..షూటింగ్లోనే కొట్టిన అడివి శేష్.?
ఆయన పిల్లలకు మిగిలేది చిప్పే.. మీ తండ్రి సంపాదిస్తారు.తన సంపాదన మీద బతుకుతామని మీరు ఎప్పుడూ కూడా ఊహించుకోకండి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసినదంతా ప్రజల కోసమే ఖర్చు పెట్టడానికి సరిపోతుంది. మీరు ఆయన మీద ఆశలు పెట్టుకుని సంపాదన లేకుండా ఉంటే చిప్పగతే.. అకిరా సినిమాల్లోకి వచ్చి ముందుగా డబ్బులు వెనకేసుకో..
మీ చెల్లెలు కూడా ఏదో ఒక బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకోమని చెప్పు..అంటూ సోషల్ మీడియాలో మీమ్స్,ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సోషల్ మీడియా ట్రోల్స్, మీమ్స్ చూసిన చాలా మంది నేటిజన్స్ పవన్ కళ్యాణ్ ఇలాగే దానధర్మాలు చేసుకుంటూ పోతే ఈ సోషల్ మీడియా పెట్టిన మీమ్సే నిజమవుతాయి అని కామెంట్లు పెడుతున్నారు.(Pawan Kalyan)