Simran: సీనియర్ నటి సిమ్రాన్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన హాట్ హాట్ కామెంట్లతో ఎప్పటికప్పుడు మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.ముఖ్యంగా ఈమె తరచు తనకు జరిగిన ఒక అన్యాయం గురించి బయట పెడుతూ ఉంటుంది. ఇది కేవలం తనకు మాత్రమే కాదు తన కుటుంబానికి కూడా తీరని అన్యాయం అని గొంతు విప్పుతూ ఉంటుంది.మరి ఇంతకీ సిమ్రాన్ కి జరిగిన అన్యాయం ఏంటి.. ప్రియుడు కోసం సూసైడ్ అంటూ ఆమె ఎందుకు మాట్లాడింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
Simran made sensational comments
ఒకప్పుడు బాలకృష్ణ, చిరంజీవి,వెంకటేష్,నాగార్జున వంటి స్టార్ హీరోలతో జతకట్టిన సిమ్రాన్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా దాదాపు రెండు దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలింది. ఈ హీరోయిన్ హైట్ వెయిట్ పర్సనాలిటీ చాలా బాగుండడంతో ఎంతో మందికి హిట్ పెయిర్ అనే గుర్తింపు తెచ్చుకుంది. అలా బాలకృష్ణతో మాత్రం ఈ హీరోయిన్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్. ఇక అలాంటి సిమ్రాన్ చెల్లెలు మోనాల్ ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు.(Simran)
Also Read: Allu Arjun: తండ్రితో విభేదాలు.. వేరు కాపురం పెట్టబోతున్న అల్లు అర్జున్.?
అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బతికి లేదు.ఆమె సూసైడ్ చేసుకొని మరణించింది.ఇక ఈ విషయాన్ని సిమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా చెల్లెలు మరణం ఇప్పటికీ మా కుటుంబానికి తీరని లోటు. కానీ ఏం చేస్తాం. అది నిజం కాబట్టి మర్చిపోక తప్పడం లేదు.. అయినా ప్రియుడు కోసం ఆమె ఆత్మహత్య ఎలా చేసుకుంటుంది.
కుటుంబంలో ఇంతమంది ఉన్నామని ఒకసారైనా ఆలోచించాలి కదా.. అంటూ తన చెల్లెలు మరణం పై ఎమోషనల్ కామెంట్స్ చేసింది సిమ్రాన్. ఇక హీరోయిన్ సిమ్రాన్ తన చెల్లెలు మరణాన్ని ప్రతిసారి గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అయితే సిమ్రాన్ చెల్లెలు మోనాల్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న తరుణంలో ఓ కోలివుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడి ఆయన మోసం చేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకొని మరణించింది.(Simran)