Singer Suchitra who defamed Jyothika

Singer Suchitra: సింగర్ సుచిత్ర చాలా మంది సెలబ్రిటీలపై ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.తన మాజీ భర్త కార్తీక్ పై అలాగే హీరో ధనుష్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించాయో చెప్పనక్కర్లేదు. రీసెంట్గా నయనతార ధనుష్ వివాదంలో దూరి ధనుష్ 150 మంది హీరోయిన్లను వేధించాడంటూ మాట్లాడింది. అలా ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసే సింగర్ సుచిత్ర తాజాగా జ్యోతిక పై పడింది.

Singer Suchitra who defamed Jyothika

జ్యోతిక రీసెంట్గా తన భర్త నటించిన కంగువా సినిమా గురించి మాట్లాడుతూ..ఫస్ట్ అరగంట సినిమా బాలేదు. కానీ ఆ తర్వాత సినిమా అద్భుతంగా ఉంది.ఎన్నో సినిమాల్లో ఆడవాళ్లను అసహ్యంగా చూపించారు. కానీ కేవలం ఈ సినిమా పైనే పడుతున్నారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది.సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. కానీ వీటన్నింటినీ పక్కనపెట్టి కేవలం ఒక్కదాన్నే పట్టుకుంటున్నారు. అంటూ తన భర్త కంగువా సినిమాపై రివ్యూ ఇచ్చింది జ్యోతిక.(Singer Suchitra)

Also Read: Dhanush: వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు.. రాధిక పై ధనుష్ షాకింగ్ కామెంట్స్..?

అయితే ఈ రివ్యూ పై సింగర్ సుచిత్ర మాట్లాడుతూ… అసలు జ్యోతిక ఏం మాట్లాడిందో అర్థం అవ్వడం లేదు.సినిమా అరగంట బాలేదు అంటే అరగంట అయిపోయాక సినిమాకి రావాలా..సూర్య గొప్ప నటుడు అనే విషయం అందరికీ తెలుసు.కానీ ఈ సినిమాని వెన్నులో పెట్టుకుని నడిపించాలనే ఆలోచన ఆయనకు లేదు. కానీ ఆయన కంగువా సినిమాలో నటించినందుకు సూర్యని ఎవరు మెచ్చుకోవడం లేదు? జ్యోతికకు పెద్దగా చదువు లేదనిపిస్తోంది.

Singer Suchitra who defamed Jyothika

సినిమాటోగ్రాఫర్ ని మెచ్చుకొని ఆయనకు కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి.ఆయనేమైనా తన భర్త చేసే నెక్స్ట్ సినిమాకి పని చేస్తారా ..జ్యోతిక పెద్ద సెల్ఫిష్.. అసలు నువ్వు సూర్యని పెళ్లి ఎందుకు చేసుకున్నావో నాకు అర్థం అవ్వడం లేదు.అయినా నువ్వు ముంబై ఈవెంట్లో బ్రా మీద కోటు వేసుకున్నప్పుడే నాకు అర్థమైంది. గుడ్డి దానివి.. చెవిటి దానివి అని..నువ్వు ఇంకా మాట్లాడొద్దు అంటూ హీరోయిన్ జ్యోతిక ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సింగర్ సుచిత్ర.మరి ఈ వ్యాఖ్యలపై జ్యోతిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.(Singer Suchitra)