Singham Again Trailer Smashes Records Despite Mixed Reactions

Singham Again Trailer: రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న “సింగం ఎగైన్” నవంబర్ 1, 2024న థియేటర్లలో విడుదల కానుంది. అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో భాగమైన ఈ చిత్రం, “సింగం”, “సింగం రిటర్న్స్”, “సింబా”, “సూర్యవంశీ” వంటి పాపులర్ సినిమాల్లోని పాత్రలను తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.

Singham Again Trailer Smashes Records Despite Mixed Reactions

ఇటీవల విడుదలైన ట్రైలర్ హిందీ సినిమాల చరిత్రలోనే అతి పొడవైన ట్రైలర్‌గా రికార్డును సృష్టించింది. అంతే కాకుండా, 24 గంటల్లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 138 మిలియన్ వ్యూస్ సాధించి మరో రికార్డును బద్దలు కొట్టింది. ట్రైలర్‌కు విపరీతమైన స్పందన లభించినప్పటికీ, కొంత నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ కూడా ఎదురైంది. ట్రైలర్ చాలా పొడవుగా ఉందని, కథ మొత్తం చెప్పేసినట్లు ఉందని కొందరు విమర్శిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయని, సినిమాలో కూడా ఇంకా ఉండబోతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Also Read: Vettaiyan: రజినీకాంత్ క్రేజీ సినిమా కి తెలుగు లో నో బజ్.. రాజకీయాలా!!

“సింగం ఎగైన్” లో అజయ్ దేవగన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ బజీరావ్ సింగంగా కనిపించనున్నారు. దీపికా పదుకొనే లేడీ సింగం పాత్రలో నటిస్తుండగా, రణవీర్ సింగ్ సింబాగా, అక్షయ్ కుమార్ సూర్యవంశీగా తమ పాత్రలను తిరిగి చేస్తున్నారు. అర్జున్ కపూర్ ప్రతినాయకుడిగా మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, రోహిత్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ సృష్టించిన హైప్ సినిమాకు పాజిటివ్‌గా పనిచేయగలదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.