Sivakarthikeyan Praises Sai Pallavi Talent and Brand Value

Sivakarthikeyan: సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటిస్తున్న ‘అమరన్’ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో శివ కార్తికేయన్, సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Sivakarthikeyan Praises Sai Pallavi Talent and Brand Value

సాయి పల్లవిని తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, శివ కార్తికేయన్ మాట్లాడుతూ, “నేను టీవీ ఛానల్‌లో పని చేస్తున్న రోజుల్లో, ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఆమె ‘ప్రేమమ్’ సినిమాలో నటన చూసి, నేను పూర్తిగా ముగ్ధుడైపోయాను” అన్నారు. వెంటనే ఆమెకు ఫోన్ చేసి తన అభినందనలు తెలియజేయగా, ఆమె “థాంక్స్ అన్నా” అని చెప్పిందని, ఆ మాట తనకు కొంచెం బాధ కలిగించిందని నవ్వుతూ చెప్పారు. అప్పట్లో తన సినిమా రంగంలోకి రాలేదని, అందుకే ఆమె తనను “అన్నా” అని పిలిచినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

Also Read : Producer Dil Raju: సినిమా హిట్ అయ్యిందని ప్రభాస్ పార్టీ.. తీరా చూస్తే పెద్ద ప్లాప్!!

అయినప్పటికీ, సాయి పల్లవి ఇప్పటికీ గొప్ప నటి, ఆమె పేరు బ్రాండ్ అని, ఆమెతో నటించడం తన అదృష్టమని శివ కార్తికేయన్ అభిప్రాయపడ్డారు. ఆమె అందం, అభినయం, డ్యాన్స్‌లో ప్రత్యేకమైనది, అంతేకాకుండా ఆమెతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.

‘అమరన్’ సినిమాలో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఒక బయోగ్రాఫికల్ యాక్షన్ థ్రిల్లర్ కాగా, రాజ్ కుమార్ పెరియసామి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సాయి పల్లవి, శివ కార్తికేయన్ కలయికతో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.