SLBC Meeting: ఈరోజు అమరావతిలో సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగబోతోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం జరగబోతోంది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఈ సమావేశంలో పాల్గొనబోతోంది. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాల పైన ఎస్ ఎల్ బి సి లో చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇప్పటికే చెప్పినట్లు పెన్షన్ అందించింది.
SLBC Meeting Today
మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేయడం గురించి శ్రద్ధ పెట్టబోతోంది. చంద్రబాబు నాయుడు ఈ విషయంపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈనెల 22వ తేదీ లేదా ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలని నిర్వహించాలని నియోచిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కష్టమని ఆర్థిక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఒకటో అకౌంటు బడ్జెట్ను కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ఇంకో నాలుగు నెలల పాటు ఆర్డినెన్స్ తేవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఆర్థిక విసులుబాటు వివిధ శాఖలోని ఆర్థిక పరిస్థితి గురించి క్లారిటీ రావడానికి మరో రెండు నెలల సమయం పట్టొచ్చు అని తెలుస్తోంది.
Also read: Heroine: కోటీశ్వరుల సంబంధాలు వచ్చినా ఆ చిన్న డైరెక్టర్ ని పెళ్లాడిన హీరోయిన్.?
ఏపీ ఆర్థిక పరిస్థితి పై క్లారిటీ వచ్చిందంటే సెప్టెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకురావచ్చు అని ఆర్థిక శాఖ అంచన. ఆర్డినెన్స్ పెట్టాలని ప్రాతిపదికను ప్రభుత్వ పెద్దల ఆమోదం కోసం చూస్తోంది ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఇలాంటి కీలక అంశాల గురించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కాబోతున్నారు. వ్యవసాయ రుణాల గురించి సంక్షేమ పథకాల అమల గురించి రుణ లక్ష్యాలపై గురించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సందర్భంగా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది చూడాలి (SLBC Meeting).