Sobhita who shared hot photos.. What did Naga Chaitanya do

Naga Chaitanya: తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది. అయితే ఈమె సినిమాల్లో నటించి ఫేమస్ అయిన దానికంటే అక్కినేని నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గానే ఇండస్ట్రీలో ఎక్కువగా వైరల్ అయింది. ఇక సినిమాలో నటించిన రాని గుర్తింపు నాగచైతన్య లవర్ గా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈ హీరోయిన్ కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తీసుకువచ్చిన సినిమా అడివి శేష్ హీరోగా చేసిన మేజర్.ఈ మూవీ తోనే శోభితకి ఇండస్ట్రీలో గుర్తింపు లభించింది.

Sobhita who shared hot photos.. What did Naga Chaitanya do

ఇక శోభిత ధూళిపాళ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం వంటి సినిమాల్లో కూడా నటించింది.ఇక ఈమె తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 మూవీలో నటించింది. అలాగే ఈ హీరోయిన్ హాలీవుడ్ లో కూడా చేసింది.ఈ హీరోయిన్ చేసిన హాలీవుడ్ వెబ్ సిరీస్ మంకీ మ్యాన్ ప్రస్తుతం మంచి ఆదరణ పొందింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ పై గురించి గత సంవత్సరం నుండి ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయే చెప్పనక్కర్లేదు. (Naga Chaitanya)

Also Read: Sudeep: ఆ హీరోయిన్ తో ఎఫై** .. భార్యకు విడాకుల ఇవ్వాలనుకుంటున్న సుదీప్..?

మరీ ముఖ్యంగా నాగచైతన్యతో ఈమె మీడియాకి దొరికిన ప్రతిసారి ఎంత కవర్ చేసుకున్నా కూడా ఈ వార్తలు ఆగడం లేదు.రెస్టారెంట్లో వీరికి సంబంధించిన ఫోటోలు చక్కర్లు కొట్టడం ఇప్పటికీ ఓ సెన్సేషనే. ఇలా నాగచైతన్య శోభిత దులిపాళకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే అటు శోభిత ఇటు నాగచైతన్య పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఎదురవుతుంది.

Sobhita who shared hot photos.. What did Naga Chaitanya do

ఇక ఆ ప్రశ్న ఎదురైన ప్రతిసారి అలాంటిదేమీ లేదు అని ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి రూమర్స్ వైరల్ చేసే వారికి అర్థం కాదు అనేలా మాట్లాడుతున్నారు.కానీ జనాలు మాత్రం నాగచైతన్య రెండో పెళ్లి చేసుకునేది శోభిత ధూళిపాలనే అంటూ కన్ఫామ్ చేస్తున్నారు.అయితే తాజాగా శోభిత చీర కట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇక ఆ ఫోటోలను చూసిన నాగచైతన్య లైక్ కొట్టారు. ఇది గమనించిన జనాలు ఊరుకుంటారా.. దీన్ని వైరల్ చేస్తూ నాగచైతన్య శోభిత మధ్య ప్రేమాయణం నడుస్తుంది అనేదానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఉండదు అంటూ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.(Naga Chaitanya)