Sonakshi Sinha: బాలీవుడ్ భామ సోనాక్షి సింహ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత నెల 23వ తారీఖున ఈ ముద్దుగుమ్మ పెళ్లి బంధం లోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లై పది రోజులు కాకముందే ఈమె ప్రెగ్నెంట్ అంటూ ఒకర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా సోనాక్షి సిన్మా స్పందిస్తూ కామెంట్స్ చేసింది. ఈ మధ్యే ఆమె టైం నౌ తో మాట్లాడుతూ తన ప్రెగ్నెన్సీ పుకార్లపై స్పందించింది.
సోనాక్షి సింహ జూన్ 23న తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ జాహీర్ ను పెళ్లి చేసుకుంది. ఇక ఆ వెంటనే ఈ జంట హాస్పిటల్ కు వెళ్ళింది. దీంతో సోనాక్షి అప్పుడే ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక వీటిపై తాజాగా ఆమె టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో స్పందించింది. తన నెక్స్ట్ మూవీ కాకుండా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత జీవితం పై సోనాక్షి మాట్లాడుతూ..” జీవితం ఎంతకంటే గొప్పగా ఉండదు.
నా పెళ్ళిలో విశేషం ఏమిటంటే జీవితంలో పెద్ద మార్పేమి రాలేదు. పెళ్లికి ముందు కూడా నా జీవితం ఎంతో బాగుండేది. ఇప్పుడు కూడా మళ్లీ అందులోకే తిరిగి వచ్చాను. మళ్లీ షూటింగ్ లు మొదలుపెట్టడం సంతోషంగా ఉంది. ఒకే ఒక్క మార్పు ఏంటంటే ఇప్పటినుంచి మేము హాస్పటల్ కి వెళ్ళాము. ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలు నేను ప్రెగ్నెంట్ అని అందరూ అనుకుంటున్నారు ” అంటూ సోనాక్షి కామెంట్స్ చేసింది. ప్రజెంట్ ఈ బ్యూటీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సోనాక్షి వ్యాఖ్యలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.