Sonakshi Sinha: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతుందని గత కొద్ది రోజులుగా బీటౌన్ లో కొన్ని వార్త చక్కర్లు కొడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఈ హీరోయిన్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. దాంతో అసలు ఈ హీరోయిన్ పెళ్లి వార్తలు రూమర్సా లేక నిజమా అని ఈమె అభిమానులు సతమతంలో పడిపోయారు. కానీ ఎట్టకేలకు ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోబోయేది నిజమే..
Sonakshi Sinha wedding celebrations
తాజాగా సోనాక్షి పెళ్లికి సంబంధించిన పెళ్లి వేడుకలు కూడా షురూ అయ్యాయి. ఈమె రేపు అనగా జూన్ 23న గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతోంది.అయితే ఈమె పెళ్లికి తండ్రి శత్రజ్ఞ సిన్హ రావడం లేదని ఇక్బాల్ జహీర్ ని పెళ్లి చేసుకోవడం సోనాక్షి ఫ్యామిలీకి ఇష్టం లేదని,అందుకే ఇన్స్టాగ్రామ్ లో సోనాక్షి ఫ్యామిలీ ఆమెను అన్ ఫాలో చేసినట్టు రూమర్స్ వినిపించాయి. (Sonakshi Sinha)
Also Read: HBD thalapathi Vijay: నేడు విజయ్ దళపతి పుట్టినరోజు… స్పెషల్ విషెస్ తెలియజేస్తున్న అభిమానులు..!
అయితే రీసెంట్ గా కూతురు పెళ్లి వార్తలపై తండ్రి ని మీడియా వాళ్ళు అడగగా అలాంటిదేమీ లేదు ఒకవేళ నా కూతురు పెళ్లి చేసుకునేది నిజమే అయితే నేను బరాత్ లో డాన్స్ చేస్తా అని చెప్పారు. అయితే తాజాగా సోనాక్షి పెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు అనే రూమర్స్ పై కూడా శత్రజ్ఞ సిన్హ మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదు నాకు ఒక్కగానొక్క కూతురు. నా కూతురు పెళ్లికి నేను వెళ్లకుండా ఉండడం ఏంటి.
నేను నా కూతురి పెళ్ళికి వెళ్తున్నాను.ఈ రూమర్స్ ఆపండి అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా కొద్దిమంది సన్నిహితుల మధ్యలో సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ ల మెహందీ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలో సోనాక్షి సిన్హా తండ్రి కనిపించలేదు.దాంతో బీటౌన్ లో మరోసారి ఊహగానాలు వినిపిస్తున్నాయి.(Sonakshi Sinha)