Soundarya first love is that hero.. Did she also write a love letter

Soundarya: దివికేగిసిన అందాల తార సౌందర్య ప్రస్తుతం మన ముందు లేదు. ఆమె 2004 ఏప్రిల్ 17న మరణించింది. ఇక ఆమె చనిపోయి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటికీ సౌందర్యని సినీ ఇండస్ట్రీ మరవలేక పోతోంది. అయితే ఈరోజు అనగా జూలై 18న సౌందర్య పుట్టినరోజు.ఆమె 1976 జూలై 18న జన్మించింది. ఇక సౌందర్య బతికిలేకపోయినప్పటికీ ఆమె గురించి ఎన్నో విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు చూద్దాం.

Soundarya first love is that hero.. Did she also write a love letter

సౌందర్య నిజంగానే ఆ హీరోకి లవ్ లెటర్ రాసిందా.. ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది చూద్దాం.. సౌందర్య హీరో అలాగే విలన్ పాత్రల్లో నటిస్తున్న జగపతి బాబు కి లవ్ లెటర్ రాసింది అంటూ అప్పట్లో ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. అయితే జగపతి బాబుతో సౌందర్య ఓ సినిమాలో నటించే సమయంలో ఆయనకి లవ్ లెటర్ రాసిందనే రూమర్ వినిపించింది.అయితే దీనిపై అసలు నిజం ఏంటో బయటపెట్టారు సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు. (Soundarya)

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ని దారుణంగా అవమానించిన హీరోయిన్.. మరీ అంత పొగరా..?

ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో సౌందర్య నిజంగానే జగపతిబాబుకి లవ్ లెటర్ రాసిందా.. అప్పట్లో వైరల్ అయిన న్యూస్ లో ఎంత నిజం ఉంది అని యాంకర్ అడగగా..అసలు జగపతిబాబుకు సౌందర్య లవ్ లెటర్స్ రాసింది అనే దాంట్లో ఎలాంటి నిజం లేదు. అయితే జగపతిబాబుతో ఓ సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో ఆమె కొన్ని పేపర్స్ రాసేది.ఆ పేపర్స్ లవ్ లెటర్స్ అని కొంతమంది దాన్ని ప్రచారం చేశారు.

Soundarya first love is that hero.. Did she also write a love letter

అయితే అందరికీ తెలియని ఒక నిజం ఏంటంటే.. సౌందర్య కవిత్వం రాస్తుంది.ఈ విషయం చాలామందికి తెలియదు.అంతేకాకుండా ప్రేమ గురించి ఆమె ఎక్కువగా కవిత్వాలు రాసేది. అయితే ఆ ప్రేమ కవిత్వాలు చూసిన చాలామంది జనాలు జగపతి బాబుకి ప్రేమలేఖలు రాసింది అని అనే గాసిప్ ని వైరల్ చేశారు.కానీ దీంట్లో ఎలాంటి నిజం లేదు. ఇక సౌందర్య రఘుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.. అంటూ ఈమంది రామారావు సౌందర్య గురించి స్పష్టతనిచ్చారు.(Soundarya)