Virat Kohli May Leave RCB Team

Virat Kohli: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ మరియు అతని భార్య అనుష్క శర్మ ఇద్దరు ఇండియాను వదిలి లండన్కు వెళ్ళనున్నారట. పూర్తిస్థాయిలో… ఇండియాకు గుడ్ బాయ్ చెప్పి లండన్ లో సెటిల్ కావాలని విరాట్ కోహ్లీ కు ఫ్యామిలీ డిసైడ్ అయిందట. RCBని కూడా కో హ్లీ వదిలేస్తాడట. లండన్ లో ఉంటూ ఢిల్లీకి ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. Virat Kohli

Virat Kohli May Leave RCB Team

విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే స్టార్ డం తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అండర్ 19 వరల్డ్ కప్ తీసుకువచ్చిన విరాట్ కోహ్లీ నేరుగా టీమిండియాలోకి వచ్చాడు. ధోని తర్వాత టీమిండియా పగ్గాలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ. అలాగే మొదటి వికెట్ కు బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ… సచిన్ టెండూల్కర్ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. అటు తన కెప్టెన్సీలో టీమిండియా కు అనేక విజయాలను అందించాడు. Virat Kohli

Also Read: Ipl 2024: సూర్యకుమార్ హార్ట్ బ్రేక్ పోస్ట్… ఐపీఎల్ నుంచి ఔట్?

దీంతో దేశవ్యాప్తంగానే కాకుండా పాకిస్తాన్ లాంటి దేశాలలో కూడా విరాట్ కోహ్లీకి క్రేజ్ పెరిగిపోయింది. ఐపీఎల్ టోర్నమెంట్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. గతంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అతని కెప్టెన్సీ పోయింది. ఇప్పుడు సాధారణ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. Virat Kohli

ఇక ఇటీవల అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. లండన్ లో అనుష్క శర్మ డెలివరీ అయింది. దీంతో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ను వదులుకొని లండన్ లోనే ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడే ఒక విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేశారట విరాట్ కోహ్లీ. మరో ఏడాది సమయంలో టీమిండియా కు రిటైర్మెంట్ ప్రకటించి అక్కడే సెటిల్ కావాలని విరాట్ కోహ్లీ ఫ్యామిలీ డిసైడ్ అయిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. Virat Kohli

Join WhatsApp