Karthika Masam: కార్తిక మాసంలో మహిళలు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి దీపం వెలిగించడం మన చూస్తాం. ఈ విధంగా దీపారాధన చేయడానికి వారు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఈ మాసం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం. హిందూ సాంప్రదాయంలో ఈ నెలలో ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష సాధనకు విశిష్టత మైనదిగా భావిస్తారు. అందరూ శివాలయం, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కార్తీకమాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ దీపాలు వెలిగించడం వల్ల దేవుడు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయనీ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ కార్తీకదీపాన్ని ఏ మూడు ప్రాంతాల్లో వెలిగించాలో ఇప్పుడు చూద్దాం.
Spots for Lighting Lamps During Karthika Masam
కార్తీకమాసంలో చాలామంది సాయంత్రం వేళల్లో శివాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. అయితే ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేటప్పుడు ఈ మూడు చోట్ల తప్పకుండా దీపాలు వెలిగిస్తే మీకు శుభం జరుగుతుంది. మొట్టమొదటి ప్రవేశం గోపుర ద్వారం. మీరు ఆలయానికి వెళ్ళగానే ముందు గోపురం కనిపిస్తుంది. అక్కడ మట్టి ప్రమిదలతో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. తర్వాత నందీశ్వరుడు దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత మూడవ ప్రదేశము గర్భగుడిలో ఈశ్వరుడికి వీలైనంత సమీపంలో దీపం వెలిగించాలని స్కంద పురాణంలో చెప్పారు.
Also Read: పిల్లలకి చదువు మీద ఆసక్తి కలగాలంటే తల్లితండ్రులు ఇలా చేయండి!!
విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించేటప్పుడు ప్రత్యేక విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలి. దాదాపు అందరూ విష్ణు ఆలయంలో మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తారు. కానీ ఇలా దీపం వెలిగించిన తర్వాత అక్కడ కొన్ని అవిసె పుష్పాలు కూడా ఉంచాలి. అయితే మీకు అవిశ పుష్పాలు అందుబాటులో లేకపోతే ఇలా చేయండి. ఆ దీపం దగ్గర తమలపాకులలో కొద్దిగా నువ్వులు, బెల్లం దాన్యం,నైవేద్యంగా ఉంచాలి. ఇటువంటి దీపాన్ని నందా దీపం అని అంటారు. ఈ దీపం చాలా శక్తివంతమైంది.
సాధ్యమైనంత వరకు పెద్ద ప్రమిదలో దీపం వెలిగించి తొందరగా కొండెక్కకుండా చూసుకోండి. నంద దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, విష్ణు సంబంధితమైన ఏ ఆలయంలోనైనా సరే నంద దీపం వెలిగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా భగవంతుడి ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది.