Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్.. ఈయన తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా ఉండేవారు. సినిమా ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పినటువంటి గొప్ప నటుడు. కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా తనకెవరు సాటి లేరు అనిపించుకున్నారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పలేం. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు రాష్ట్రాలకి కూడా ఎన్నో సేవలు అందించారు.
Sr.NTR threatened son What did he do so wrong
ఎన్నో నెంబర్ వన్ విజయాలను అందుకొని అదరహో అనిపించారు. 1982లో టిడిపి పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డ్ క్రియేట్ చేశాడు. అలా అంచలంచెలుగా ఎన్టీఆర్ ఎదగడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎదిగేలా చేశారు. అలాంటి ఎన్టీఆర్ కి మొత్తం 12 మంది సంతానం. ఇందులో ఎనిమిది మంది అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు. వీరందరిలో మనందరికీ ఎక్కువగా తెలిసింది బాలకృష్ణ, హరికృష్ణ, పురందేశ్వరి,భువనేశ్వరి మాత్రమే.. (Sr.NTR)
Also Read: Pushpa2: విడుదలకు ముందే సంచలనాలను సృష్టిస్తున్న అల్లు అర్జున్ ‘పుష్ప 2’!!
అయితే వీరంతా సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా భయపడేవారు. కనీసం ఆయన ముందు ఒక్క మాట కూడా మాట్లాడే వారు కాదు. అలాంటి ఎన్టీఆర్ ను తన కొడుకుల్లో ఒకరైన వ్యక్తి జయశంకర్ కృష్ణ బెదిరించారట. ఆయన అలా అనడంతో సీనియర్ ఎన్టీఆర్ కూడా తనకు ఉన్నటువంటి ఒక వ్యసనాన్ని కూడా మానేశారట. ఆ వ్యసనం ఏంటో ఇప్పుడు చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ కి ఉదయం నిద్ర లేవగానే చుట్ట తాగే అలవాటు ఉంది. ఈ విషయం కుటుంబంలోని వారందరికీ తెలుసు.
చుట్ట తాగడం వల్ల గొంతులో ఉన్నటువంటి శ్లేష్మమంతా కరిగిపోయి స్వరం బాగుంటుందని ఆయన చుట్ట తాగే వారట. అయితే ఎన్టీఆర్ తాగుతూ ఉండగా తన కొడుకు అయినటువంటి జయశంకర్ కృష్ణ చూసి చుట్ట తాగడం మానేయాలని అన్నారట. దీన్ని మొత్తం గమనించినటువంటి జయశంకర్ కృష్ణ డైరెక్ట్ గా వాళ్ళ నాన్నను మీరు పొగ తాగడం మానేయండి అంటూ గట్టిగా మాట్లాడారట. దీంతో విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ అప్పటినుంచి చుట్ట అనే వ్యసనానికి పూర్తిగా దూరమైపోయి దాని జోలికి వెళ్లలేదట.(Sr.NTR)