Sr.NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఆకాశానికి ఎత్తిన నటుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీనియర్ ఎన్టీఆర్ సావిత్రి అని చెప్పవచ్చు. వీరిద్దరూ ఇండస్ట్రీలో చేయని పాత్ర లేదు. వీరు ఇండస్ట్రీలో ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేసిన గొప్ప నటులు. అలా సావిత్రి ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇందులో ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 30 చిత్రాల వరకు వచ్చాయట. దీనికి ప్రధాన కారణం అప్పట్లో హీరోయిన్ల కొరత ఉండటం వల్ల ఒకే హీరోయిన్ తో చాలా సినిమాలు చేసేవారు.
Sr.NTR took Savitri to a new house and that work.
అంతేకాకుండా ఇప్పటిలాగా ఒక్క సినిమా మూడేళ్లు నాలుగేళ్లు చేయకుండా ఒక ఏడాదిలో ఐదు నుంచి ఎనిమిది చిత్రాలు వరకు చేసేవారు. హీరోయిన్లు రిపీటెడ్ గా ఉండేవారు. ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్ లో 30కి పైగా చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్ తెరపై తరచూ కనిపించడంతో ఇండస్ట్రీలో రూమర్ పుట్టింది. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని, వీరి మధ్య మంచి బాండింగ్ నడుస్తోందంటూ ఒక టాక్ వినిపించింది. అప్పట్లో సోషల్ మీడియా అందుబాటులో లేదు .(Sr.NTR)
Also Read: Allu Arjun: అందరిముందు లైవ్ లో అల్లు అర్జున్ ను దారుణంగా అవమానించిన స్టార్ హీరోయిన్!!
కానీ వార్త పత్రిక ద్వారా వీరి రిలేషన్షిప్ గురించి కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇటు సావిత్రి కానీ, అటు ఎన్టీఆర్ కానీ స్పందించలేదు. డైరెక్ట్ గా రియాక్ట్ కాకుండా ఒక మెసేజ్ ద్వారా వారి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేశారు. ఇలా వార్తలు తరచూ వస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఒక కొత్త ఇల్లు కొన్నాడట. ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయడానికి సావిత్రిని పిలిచారట. సావిత్రితోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించారట.
అంటే ఏదైనా ఇల్లు గృహప్రవేశం చేసినప్పుడు మన తోబుట్టువులను పిలుచుకొని పాలు పొంగించుకొని అన్ని పనులు చేయించుకుంటాం. ఆ విధంగానే ఎన్టీఆర్ కూడా సావిత్రి నా సొంత చెల్లెలు అని ప్రజలకు చాటి చెప్పడం కోసం ఇలా చేశాడట. ఎప్పుడైతే సావిత్రి గృహప్రవేశంలో పాల్గొందో అప్పటినుంచి వీరి మధ్య ఉన్న రిలేషన్ అన్నాచెల్లెల బంధం అని అందరూ ఫిక్స్ అయిపోయారు. వీరిపై ఒక్క బ్యాడ్ రూమర్ కూడా బయటకు రాలేదు.(Sr.NTR)