Sridevi: శ్రీదేవి ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె కడుపులో తంతు అంత టార్చర్ చేశారా? ఇంతకీ శ్రీదేవికి అంతలా నరకం నరకం చూపించి టార్చర్ చేసింది ఎవరు? అంత పెద్ద హీరోయిన్ టార్చర్ పడుతుంటే ఇంతవరకు ఎందుకు బయటికి రాలేదు అంటున్నారు ఈ విషయం తెల్సిన ఆమె అభిమానులు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లో ఇలాంటివి జరిగితే వాటిని అస్సలు బయటికి రానివ్వరు. ఒకవేళ బయటపడ్డా కూడా అవన్నీ రూమర్స్ అని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు..
Sridevi torture during pregnancy
అవి అఫైర్స్ అయినా గొడవలైన ఏదైనా కానీ. కానీ ఈ సెలబ్రిటీలు ఎంత దాచి పెట్టాలని చూసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఈ విషయాలు బయటపడుతూనే ఉంటాయి. అయితే గతంలో బోనికపూర్ ని పెళ్లి చేసుకున్న సమయంలో కూడా శ్రీదేవికి ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయట. శ్రీదేవిని పెళ్లి చేసుకోవడం బోనీకపూర్ తల్లికి,మొదటి భార్యకి ఎవరికి ఇష్టం లేదు. దాంతో బోనీకపూర్ తల్లి, మొదటి భార్య ఇద్దరు శ్రీదేవిని సమయం దొరికితే చాలు హింసించే వారట. (Sridevi)
Also Read: Hansika: పెళ్లయిన రెండేళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన హన్సిక..?
అంతేకాదు బోనికపూర్ మొదటి భార్య అయితే శ్రీదేవి గర్భంతో ఉంది అనే విషయం కూడా మర్చిపోయి ఓసారి కడుపు మీద తన్నిందనే వార్త అప్పట్లో బీటౌన్ లో సంచలనం సృష్టించింది.కానీ ఈ వార్తపై ఎవరు స్పందించలేదు. అలాగే బోనీకపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ కూడా శ్రీదేవి దగ్గర ఉండే డబ్బు కోసం ఆశపడి ఆమెను ఎంతగానో వేధించేవారట. కానీ శ్రీదేవి మాత్రం ఆయనను కొడుకు గానే భావించి చాలా డబ్బులు ఇచ్చిందట.
కొన్ని కొన్ని సమయాల్లో డబ్బులు ఇవ్వకపోతే అర్జున్ కపూర్ శ్రీదేవిని జుట్టు పట్టుకొని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని శ్రీదేవి జీవితాన్ని దగ్గరుండి చూసినవాళ్లు కొంతమంది అప్పుడప్పుడు బయటపెట్టారు. ఇలా శ్రీదేవి బతికున్న సమయంలో అత్తింట్లో ఎంతో టార్చర్ అనుభవించినప్పటికీ బయటికి వస్తే మాత్రం మహారాణిలానే కనిపించేది. ఇక ఎప్పుడైతే పిల్లలు పెద్దయ్యారో అప్పటినుండి శ్రీదేవి ఎవరిపై డిపెండ్ అవ్వకుండా ఎవరిని నమ్మకుండా తన పిల్లల కోసమే బతికింది.(Sridevi)