Sridevi: దివంగత నటి శ్రీదేవి అంత పెద్ద పొగరుబోతా.. ఇంతకీ శ్రీదేవిని పొగరుబోతు అని నిందించిన ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.శ్రీదేవికి పొగరు అని కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక్క హీరోయినే కాదు ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సెలెబ్రిటీలు కూడా అన్నారు. అయితే శ్రీదేవి ప్రవర్తనే అలా ఉంటుందో లేక కావాలనే అలా చేస్తుందో తెలియదు కానీ ఆమె చాలా సెలబ్రిటీల విషయంలో పొగరుగా ప్రవర్తించదట.
Star heroine sensational comments on Sridevi
మరీ ముఖ్యంగా హీరోయిన్ జయప్రద తో మాత్రం శ్రీదేవికి అస్సలు స్నేహం ఉండేది కాదని, ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికీ కేవలం షూటింగ్ వరకే కానీ ఆ తర్వాత ఇద్దరు ఎవరో పరిచయం లేనట్లుగా ప్రవర్తించే వారని తెలుస్తుంది.అయితే ఇదే విషయాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. (Sridevi)
Also Read: Pawan Kalyan OG: తుతు మంత్రం గా సినిమాలు చేస్తున్న పవన్.. బ్యాంకాక్ సెట్ మంగళగిరి ఏంది సామీ!!
శ్రీదేవికి చాలా పొగరు ఉండేది.కనీసం ఎక్కడైనా కలిస్తే కూడా పలకరించేది కాదు. ఇక ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో చేశాం. కానీ చేసిన ప్రతి సినిమాలో డైరెక్టర్ ఈమె జయప్రద అని పరిచయం చేసే పరిస్థితి తీసుకువచ్చేది. ఇక సినిమా షూటింగ్లో ఇద్దరం చాలా బాగా కలిసి ఉండే వాళ్ళం. కానీ ఒక్కసారి కెమెరా ఆఫ్ అయితే నేను ఒక దగ్గర కూర్చుంటే ఆమె నాకు దూరంగా మరో దగ్గర కూర్చునేది.
ఆమె చాలాసార్లు నా దగ్గర గర్వంగా పొగరుగా ప్రవర్తించింది. అయినా కూడా నేను పట్టించుకోకుండా చాలాసార్లు పలకరించాను..అంటూ జయప్రద ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.ఇక జయప్రద మాత్రమే కాదు జయసుధ వంటి సీనియర్ నటి కూడా శ్రీదేవికి కాస్త పొగరెక్కువ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.(Sridevi)