Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అంటే అందరికీ సుపరిచితుడే..ముఖ్యంగా ఈయన తమన్నా ప్రియుడుగా ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయారు. ఇక విజయ్ వర్మ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో నాని హీరోగా చేసిన మిడిల్ క్లాస్ అబ్బాయి అనే మూవీలో విలన్ గా నటించారు.ఇక ఈయన తెలుగు వాడే అయినప్పటికీ బాలీవుడ్లో స్థిరపడ్డాడు.విజయ్ వర్మ ది హైదరాబాద్.. అలా తమన్నా విజయ్ వర్మల పెళ్లి జరిగితే తమన్నా తెలంగాణ ఇంటికి కోడలుగా వచ్చినట్టే అని ఇప్పటికే ఎంతోమంది ఆమె అభిమానులు అంటున్నారు.
Such a disease for Vijay Varma.. Is Tamannaah’s life ruined
అయితే తాజాగా విజయ్ వర్మకి అలాంటి వ్యాధి ఉందని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మరి ఇంతకీ విజయ్ వర్మకి ఉన్న వ్యాధి ఏంటో ఇప్పుడు చూద్దాం.. విజయ్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఏ విషయమైనా దాచి పెట్టడం ఇష్టం ఉండదని, అందుకే తమన్నాతో ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టానని, అలాగే తమన్నా తో నేను కలిసి ఉన్న దాదాపు 5000 ఫోటోలు నా దగ్గర ఉన్నాయని, అవి మా పర్సనల్ కాబట్టి ఇప్పటివరకు అవి సోషల్ మీడియాలో షేర్ చేయలేదని చెప్పుకొచ్చారు.(Vijay Varma)
Also Read: Samantha: టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్.. సమంత సంచలన కామెంట్స్..?
అంతేకాకుండా తనకి బొల్లి అనే వ్యాధి ఉందని ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. అయితే ఈ వ్యాధి గురించి ముందే చెబితే అందరూ నా వ్యాధి గురించి మాట్లాడుకుంటారు. నా నటన గురించి ఎవరూ మాట్లాడుకోరు. అందుకే ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచాను. ప్రస్తుతం నేనేంటో వాళ్లకి తెలుసు. అందుకే సక్సెస్ వచ్చింది కాబట్టి నాకున్న వ్యాధిని అందరి ముందే బయట పెడుతున్నాను.
అయితే ఇప్పటి తరం వాళ్లు నేను చెప్పిన ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకు ఉంది. అందుకే ఈ విషయాన్ని బయట పెట్టాను అంటూ విజయ్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన చాలామంది ఈ వ్యాధి ఉందని అసలు తమన్నా కైనా తెలుసా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు… పాపం తమన్నా జీవితం నాశనం అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Vijay Varma)