Sudeep wants to divorce his wife

Sudeep: కన్నడ స్టార్ హీరోలలో కిచ్చా సుదీప్ కూడా ఒకరు. ఈయన ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈయన కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు,తమిళ ఇండస్ట్రీలలో కూడా రాణించారు. అలా తెలుగులో కూడా ఈయన కొన్ని సినిమాల్లో నటించారు.మరీ ముఖ్యంగా నాని,సమంత కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ మూవీలో సుదీప్ తన విలనిజంతో సినిమాకి హైలైట్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి సుదీప్ నిజంగానే తన భార్యకు విడాకులు ఇచ్చి మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారా..

Sudeep wants to divorce his wife

వారిద్దరి మధ్య గొడవ పెట్టిన హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. కిచ్చా సుదీప్, ప్రియా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శాన్వి అనే అమ్మాయి కూడా పుట్టింది. అయితే సుదీప్ ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తన భార్య ప్రియా కి విడాకులు ఇవ్వాలి అని చూసారట. అయితే విడాకులు ఇవ్వాలి అనుకున్నది ఇప్పుడైతే కాదు.గతంలో వారి పెళ్లైన 14 సంవత్సరాలకు సినిమాల్లో స్టార్ గా రాణిస్తున్న సుదీప్ కి మరో హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అన్నట్లు కన్నడలో ఒక వార్త చక్కర్లు కొట్టిందట.(Sudeep )

Also Read: Allu Arjun: ఆ హీరోయిన్ కోసం స్నేహ రెడ్డికి బ్రేకప్.. ?

అయితే ఇది నిజమేనని భావించిన భార్య ప్రియ ప్రతిరోజూ ఇంటికి వచ్చాక గొడవ పెట్టడంతో ఇదంతా భరించలేని సుదీప్ తన భార్యకు విడాకులు ఇద్దామని అనుకున్నారట. ఇక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నారట. ఇక అలా విడాకులకు సిద్ధమైన సమయంలో సుదీప్ ఓ ఇంటర్వ్యూలో స్నేహంలో గొడవ అయితే మాట్లాడకుండా ఉండవచ్చు గాని పెళ్లి బంధం లో గొడవ అయితే మాత్రం పరిస్థితి ఇలా తయారవుతుంది అని తన విడాకుల విషయాన్నీ ఇన్ డైరెక్టుగా చెప్పారు. దాంతో వీరి విడాకుల విషయం బయటపడింది.

Sudeep wants to divorce his wife

ఆ తర్వాత కొద్ది రోజులకు సుదీప్ ప్రియాలు విడాకులు రద్దు చేసుకున్నారట. దానికి కారణం ఏంటంటే.. వారి కూతురు శాన్వి.. కూతురు కోసం విడిపోవాలి అనుకున్న జంట మళ్ళీ కలిశారట.తన భార్య కూడా సుదీప్ ని అర్థం చేసుకొని ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని ఇద్దరు ఒకరికొకరు మళ్లీ సెకండ్ ఛాయిస్ ఇచ్చుకున్నారు. అలా ఆ సమయంలో విడాకులు రద్దు చేసుకొని ఇప్పటికి కూడా ఎలాంటి గొడవ లేకుండా చాలా హాయిగా తమ సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ జంట.(Sudeep )