Suhas Starrer Janaka Aithe Ganaka to Release on October 12

Janaka Aithe Ganaka: టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న “థండేల్” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హై-బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని, వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంతో చైతన్య తన యాక్షన్ ఇమేజ్‌ను మరింత పెంచుకోవాలని చూస్తున్నారు.

Suhas Starrer Janaka Aithe Ganaka to Release on October 12

ఇదే సమయంలో, యువ హీరో సుహాస్ నటించిన “జనక అయితే గనక” దర్శకుడు సందీప్ బండ్ల ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన తొలి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, “జనక అయితే గనక” టైటిల్ పాత్రకు మొదట నాగ చైతన్యను అనుకున్నట్లు తెలిపారు. చైతన్యతో కొంతకాలం పని చేసినప్పటికీ, శేఖర్ కమ్ముల “లవ్ స్టోరీ”తో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరలేదని తెలిపారు. ఆ సమయంలో దిల్ రాజు సుహాస్‌ను సూచించినట్టు పేర్కొన్నారు.

Also Read: Vijay: ఆ హీరో కి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన విజయ్..?

“జనక అయితే గణక” అక్టోబర్ 12న విడుదల కానుంది. ఇందులో సుహాస్ నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దిల్ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ కథానాయికగా నటించగా, దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

“కలర్ ఫోటో”, “రైటర్ పద్మభూషణ్” వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సుహాస్ నుంచి వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. కామెడీతో పాటు ఎమోషన్లతో కూడిన ఈ చిత్రం సుహాస్‌కు మరో హిట్ అందిస్తుందని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.