Konda Surekha: అక్కినేని నాగార్జున పంచాయితీలోకి సుప్రీయను కూడా లాగారు మంత్రి కొండా సురేఖ. నాగార్జున కోసం సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన సుప్రీయపై మంత్రి కొండా సురేఖ తరఫు న్యాయవాది రెచ్చిపోయి మాట్లాడారు. ఆమెకు ఏమీ తెలియదంటూ ఇరికించారు లాయర్‌. మంత్రి కొండ సురేఖ తరపు న్యాయవాది మాట్లాడుతూ..మంత్రి కొండా సురేఖ పై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని తాము అనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో మూడు కాంట్రిడిక్షన్స్ ఉన్నాయని వెల్లడించారు లాయర్‌.

Supriya Comments On nagarjuna and Konda Surekha

నాగార్జున పిటిషన్ లో ఒకటి చెప్పారు, స్టేట్మెంట్లో మరొకటి చెప్పారని సెటైర్లు పేల్చారు. అలాగే సుప్రియ విట్నెస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆమె మరొక అంశం చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు కోర్టు సుప్రియ విట్నెస్ ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలని తెలిపారు. ఆమె చెప్పింది కూడా ఎవరికి అర్థం కాలేదని.. ఆమెకు ఏం జరిగిందో తెలియకుండానే కోర్టు ముందుకు వచ్చిందని చురకలు అంటించారు. అలాగే 10వ తేదీ మరొక విట్నెస్ కూడా రికార్డు చేయాలని వివరించారు. మేము ఈ కేసు కోర్టులో నిలబడదని అనుకుంటున్నామన్నారు.

Also Read: Samantha: కొండా సురేఖపై సమంత కేసు?

ఒకవేళ విట్నేసులను పరిగణలోకి తీసుకొని మంత్రికి నోటీసులు జారీ చేస్తే లీగల్ గా ఎదుర్కొంటామని హెచ్చరించారు. అలాగే మంత్రి కొండా సురేఖ పై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై డీజీపికి బుధవారం ఫిర్యాదు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. సుప్రియ స్టేట్మెంట్ లోని అంశాలు ఒకసారి పరిశీలిస్తే… మంత్రి కొండా సురేఖ చేసిన వాఖ్యలు వల్ల నాకు చాలా మంది నుండి ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు సుప్రీయ. మంత్రి చేసిన వాక్యాల వల్ల మా కుటుంబం లో మనశ్శాంతి లేకుండా పోయిందని.. రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమ టార్గెట్ గా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించారు.