Suriya: తమిళ స్టార్ హీరో సూర్య తన తాజా చిత్రం ‘కంగువ’ ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కు విచ్చేసి, అభిమానులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మీ అందరి ప్రేమ, అభిమానం నాకు ఎనలేని స్ఫూర్తిని ఇస్తున్నాయి. మీ కోసం మంచి సినిమా చేయాలనే ‘కంగువ’ను చేశా” అని అన్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రానికి శివ దర్శకత్వం వహించగా, దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. సినిమా ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి.
Suriya Discusses the Social Impact of His Films
సూర్య తన పాత్ర గురించి మాట్లాడుతూ, “‘కంగువ’ ఒక సాధారణ ఫైటర్ సినిమా కాదని, అది ఒక వారియర్ కథ అని” అన్నారు. “తన కుటుంబం, తన ధర్మం కోసం పోరాడే సైనికుడి కథ ఇది. ఇలాంటి పాత్రలు చేయడానికి నాకు దర్శకుడు రాజమౌళిగారు స్ఫూర్తినిచ్చారు” అని పేర్కొన్నారు. తన గత సినిమాలు ఎంతోమందిని ప్రేరేపించాయని, “కాక్క కాక్క” సినిమా ఒక యువకుడిని ఐపీఎస్ ఆఫీసర్‌గా మార్చిందని చెప్పారు. అలాగే, “జై భీమ్” సినిమా తర్వాత తమిళనాడులో మూడు లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.
Also Read: Janasena: జనసేనలోకి మేకతోటి సుచరిత ?
ఇక నటనలో తనకి కమల్ హాసన్ గారు ఇచ్చిన ప్రేరణ గురించి సూర్య ప్రస్తావిస్తూ, “కమల్ హాసన్ సార్ నా కెరీర్‌లో పెద్ద ప్రేరణ. ఆయన నటన ప్రతిభ, పాత్రల ఎంపిక నా పయనంలో ఎంతో ప్రభావం చూపాయి” అని తెలిపారు. ఇటీవల ఆయన నటుడు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోలో పాల్గొనడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని చెప్పారు. “బాలకృష్ణ గారితో ఆ షో చేయడం మర్చిపోలేని అనుభవం. ఆయన క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అంకితభావం చూసి, ఆయన స్థాయికి ఎందుకు చేరారో అర్థమవుతుంది” అని పేర్కొన్నారు.
‘కంగువ’ సినిమాపై దర్శకుడు శివ కూడా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “ఈ కథ వెయ్యేళ్ల క్రితం ఆదిమానవుల కాలం నాటి ఐదు తెగల మధ్య జరిగే పోరాటం చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్‌కి అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకుల మనసులను తప్పకుండా గెలుచుకుంటుంది” అని అన్నారు. అలాగే, శివ దర్శకుడు రాజమౌళి సినిమా ‘విక్రమార్కుడు’ను తమిళంలో ‘సిరుతై’గా రీమేక్ చేసి మంచి గుర్తింపు పొందానని, ‘కంగువ’ కూడా తనకు మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకంగా చెప్పారు.