Suriya Kanguva Promotions Kickstart with a Bang in Mumbai

Kanguva Promotions: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం “కంగువా”పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. సూర్య ఈ చిత్రంలో యోధుడి పాత్రలో కనిపించనుండగా, ఆయన గెటప్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం సూర్య ప్రత్యేక శిక్షణ పొందుతూ, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటి సవాళ్లను కూడా అధిగమించారు.

Suriya Kanguva Promotions Kickstart with a Bang in Mumbai

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లు అత్యంత భారీ ఎత్తున జరుగుతున్నాయి. ముంబైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో సూర్యతో పాటు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ మీడియా, అభిమానులతో ముచ్చటిస్తూ, సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సూర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కంగువా” తన కెరీర్‌లో అత్యంత వైవిధ్యమైన చిత్రమని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని తెలిపారు.

Also Read: Pushpa 2: The Rule: 50 రోజుల్లో పుష్ప ప్రభంజనం.. ఈసారి మాములుగా ఉండదట!!

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, దిశా పటానీ కథానాయికగా కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

నవంబర్ 14న గ్రాండ్ గా విడుదల కానున్న “కంగువా” బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సూర్య నటన, శి దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ కలిసి ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.