TDP MLA Adimulam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే సత్యవేడు ఆదిమూలం ను బిజెపిలో జాయిన్ చేసుకోనున్నారట. TDP MLA Adimulam
Suspended Mla Koneti Adimulam Join Bjp Party
ఆదిమూలం గత వారం రోజుల కిందట ఓ మహిళ లైగిక వేధింపుల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా మూడుసార్లు ఒకే హోటల్లో వేర్వేరు గదుల్లో టిడిపి పార్టీకి చెందిన ఓ మహిళను రే*ప్ చేశాడట. దీంతో ఆ మహిళ పక్కా ఆధారాలతో ఆదిమూలం బండారం బయటపెట్టింది. దీంతో వెంటనే చంద్రబాబు నాయుడు కూడా ఆదిమూలంపైన ఆ చర్యలు తీసుకున్నారు. TDP MLA Adimulam
Also Read: Balineni Srinivasa Reddy: జగన్ కు ఎదురు దెబ్బ… వైసీపీపై బాలినేని తిరుగుబాటు?
తెలుగుదేశం పార్టీ నుంచి టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు. దీంతో ప్రస్తుతం ఆదిమూలం చెన్నైలో ఉన్నారట. అయితే చెన్నైలో ఉన్న ఆదిమూలం… బిజెపి పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లారట. తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, ఇతర బిజెపి నేతలతో చర్చలు నిర్వహిస్తున్నారట. అతి త్వరలోనే బిజెపిలోకి కూడా వెళ్లబోతున్నారట ఆదిమూలం. ఒకవేళ ఇదే జరిగితే చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. TDP MLA Adimulam