SV Krishna Reddy Explains Why He Never Directed a Chiranjeevi

Chiranjeevi: తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఎస్వీ కృష్ణా రెడ్డి ఒకరు. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, దర్శకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగాను అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. ప్రత్యేకంగా, ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ ఆయన స్వయంగా సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ఆయన అందించిన సంగీతం, ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించడం వల్ల, సంగీత దర్శకుడిగానూ ఎస్వీ కృష్ణా రెడ్డి మంచి గుర్తింపు పొందాడు.

SV Krishna Reddy Explains Why He Never Directed a Chiranjeevi

అంతేకాకుండా, ఎస్వీ కృష్ణా రెడ్డి కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా కనిపించి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు, “మీరు మెగాస్టార్ చిరంజీవితో ఎందుకు సినిమా చేయలేదు?” అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఎస్వీ కృష్ణా రెడ్డి చిరంజీవిపై తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ, “చిరంజీవి గారితో సినిమా చేయాలనే ఆలోచన నాకుంది. నేను రెండు కథలు కూడా వినిపించాను,” అని చెప్పుకొచ్చాడు.

Also Read: Ravi Teja: రవితేజ చేయాల్సిన సినిమా ప్రభాస్ చేశాడు.. కెరీర్ మారిపోయిందిగా!!

ఆ కథల్లో ఒకటి చాలా ముందున్న కథ అని, ఆ సమయంలో అలాంటి కథ ప్రేక్షకులకు నప్పుతుందా అనే అనుమానం చిరంజీవికి ఉండడం వల్ల, ఆయ ఆ కథను తిరస్కరించారని ఎస్వీ కృష్ణా రెడ్డి వెల్లడించాడు. మరో కథను కూడా వినిపించినా, అది కూడా చిరంజీవికి నచ్చకపోవడంతో, ఆ సినిమా చేయడం వీలుకాలేదని వెల్లడించాడు. ఈ విధంగా, చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కలేదు అని ఆయన నిరాశను వ్యక్తం చేశాడు.