T20 World Cup 2024: 17 సంవత్సరాల తర్వాత టీమిండియా రెండవసారి పొట్టి ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలిచింది. ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం 2007లో మొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్ ఎప్పుడూ కప్పును గెలవలేకపోయింది. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారతజట్టు రెండవసారి కప్పును గెలిచింది. భయపెట్టిన సౌత్ ఆఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ గా నిలిచాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. T20 World Cup 2024
T20 World Cup 2024 These are the 5 main reasons for Team India success
విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం… ఈ ప్రపంచకప్ లో టీమ్ ఇండియాకు అన్నిటికన్నా పెద్ద ప్లస్ పాయింట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం. ఫైనల్ లో కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆరంభంలో వికెట్ పడడంతో ఆచితూచి ఆడిన విరాట్ కోహ్లీ 48 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ తర్వాత 10 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.విరాట్ కోహ్లీకి…. అక్షర్ పటేల్, శివమ్ దూబే చాలా చక్కటి సహకారాన్ని అందించారు. విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, శివమ్ దూబే మాత్రమే కాకుండా టీమ్ లో హైయెస్ట్ స్కోర్ ఐదు పరుగులు మాత్రమే. T20 World Cup 2024
Also Read: T20 World Cup 2024: ఫైనల్కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే విజేత ఎవరు?
ఈ మ్యాచ్ లో పేస్ బౌలింగే పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచిందంటే దానికి గల కారణం పేస్ బౌలింగే. జస్ప్రీత్ బూమ్రా నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అర్షదీప్ కూడా తన నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా తన మూడు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నారు. T20 World Cup 2024
హెన్డ్రిచ్ క్లాసేన్, క్వింటంన్ డికాక్ టీం ఇండియాను భయపెట్టారు. వీరు క్రిజ్ లో ఉన్నంతవరకు భారత్ కు మ్యాచ్ పై అస్సలు ఆశలు లేవు. చివరి 30 బంతుల్లో దక్షిణాఫ్రికా విజయానికి కేవలం 30 పరుగులు మాత్రమే అవసరమయ్యేలా తెచ్చారు. దక్షిణాఫ్రికా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో టీమిండియా ఇచ్చిన కంబ్యాక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. బుమ్రా, అర్షదీప్, హార్దిక్ చివరి 5 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ మన వైపుకు తిప్పేశారు. T20 World Cup 2024