Taapsee: ఇండియన్ హీరోయిన్ తాప్సి పన్ను రీసెంట్గా మతియాస్ బో ని పెళ్లాడింది.అయితే ఈ పెళ్లి విషయం కూడా చాలా సీక్రెట్ గా ఉంచింది. కానీ ఆ తర్వాత తన సన్నిహితుల ద్వారా ఈ విషయం కాస్త బయటపడింది. ఆ తర్వాత కొద్ది రోజులకు తాప్సి తన పెళ్లి వీడియోని షేర్ చేసుకుంది. అయితే అలాంటి తాప్సీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ హీరో ఇంటికి వెళ్తాను అని ఆసక్తికర కామెంట్స్ చేసింది. అయితే ఆ హీరోతో తాప్సీ కి గతంలో డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి.
Taapsee: Love with that hero before marriage
అయితే అలాంటి హీరో ఇంటికి వెళ్తాను అని ఆమె చెప్పడంతో నిజంగానే వారి మధ్య ఏదో ఉంది అని అందరూ భావించారు. ఇక ఆ హీరో ఎవరు కాదు మంచు మనోజ్.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ తాప్సి హీరో హీరోయిన్స్ గా చేసిన ఝుమ్మంది నాదం సినిమా సమయంలో తాప్సీ మనోజ్ మధ్య డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి.(Taapsee)
Also Read: Naga Chaitanya: బ్రేకింగ్..ఆ హీరోయిన్ తో ఈరోజే నాగచైతన్య ఎంగేజ్మెంట్..?
అయితే ఈ విషయంలో తాప్సీ మనోజ్ చాలా నవ్వుకున్నారట. ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూలలో మనోజ్ గురించి ప్రస్తావన రాగా.. అందరూ మనోజ్ తో నాకు డేటింగ్ వార్తలు అంట గడుతున్నారు.కానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు.ఈ వార్తలు వైరల్ అయిన సమయంలో మేమిద్దరం చాలా నవ్వుకున్నాం. ఎందుకంటే మా మధ్య అలాంటి బంధం ఏమీ లేదు.
మీకు అంత డౌట్ ఉంటే నేను మనోజ్ కి రాఖీ కూడా కడతాను.అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ తాప్సి చెప్పుకొచ్చింది..అంతేకాదు నేను ముంబై నుండి హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారి ఎక్కడ ఉండాలి అని ఆలోచించను. డైరెక్ట్ గా మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తాను అంటూ తాప్సి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(Taapsee)