Taapsee Pannu: దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంబానీ వారి ఇంట పెళ్లి సంచలనం సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వివాహానికి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దీనికి తోడు ప్రపంచ నాయకులు, వ్యాపారవేత్తలు, హాలీవుడ్ ప్రముఖులు తమ గళాన్ని వినిపించారు. అంబానీ పెళ్లికి వారం రోజుల ముందు నుంచే బాలీవుడ్ తారలంతా అక్కడే మకాం వేశారు.
Taapsee Pannu Comments On Ambani Marriage
పెళ్లికి ముందు జరిగే సంగీత్, మెహందీ మరియు హల్దీ వేడుకలలో బిటౌన్ స్టార్లు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ వేడుకలకు కొందరు బాలీవుడ్ తారలు గైర్హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి రాకపోవడంపై హీరోయిన్ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి రాకపోవడంపై స్పందించింది.
Also Read: Ram Charan: గేమ్ చేంజర్ ను లక్ ఒక్కటే కాపాడాలి.. రిస్క్ లో గ్లోబల్ స్టార్!!
“నాకు అంబానీ కుటుంబం వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనగానే ఎన్నో అనుబంధాలు ఏర్పడతాయి. అతిథి కుటుంబానికి, ఆతిధ్యం ఇచే కుటుంబానికి మధ్య కనీసం ఏదో ఒక అనుబంధం ఉండాలని నేను భావిస్తున్నాను. నేను అలాంటి వివాహానికి మాత్రమే హాజరవుతాను అని తాప్సీ చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వివాహానికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్, రానా దగ్గుబాటి, అక్కినేని అఖిల్, జాన్వీ కపూర్ మరియు సారా అలీ ఖాన్ వంటి ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాప్సీ సినిమాల విషయానికొస్తే, ఈ బ్యూటీ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె ఇటీవల “వో లడకీ హై కహాన్”, “ఫిర్ ఆయ్ హసీనా దిల్ రుబా”, “ఖేల్ ఖేల్ మే” వంటి చిత్రాలలో నటించనుంది. కొంతమంది సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో తన ప్రియుడు మథియాస్ బో తో వివాహం చేసుకుంది.