Raviteja: మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది. మొత్తానికి ఈ సినిమా బజ్ మామూలుగా లేదని చెప్పాలి. కొంత కాంట్రవర్షియల్ కంటెంట్ మరి కొంత సినిమా కంటెంట్ కలసి ఈ సినిమాపై ఇంతటి బజ్ రావడానికి కారణం అయ్యింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించడం ప్లస్ పాయింట్ అయితే మంచి విడుదల తేదీలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం మరొక ప్లస్ పాయింట్.

Talk on Raviteja Romance in Movies

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండగా రీసెంట్ గా టైలర్ కూడా విడుదలయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మాస్ రాజా పల్స్ కథలోని క్లాస్ కలిపి దర్శకుడు హరీష్ శంకర్ ఒక హిట్టు బొమ్మను ప్రేక్షకులకు అందించబోతున్నాడని చెబుతున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో నడిపిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే.

Also Read: Pooja Hegde: పూజా హెగ్డే ఇక అలా చేస్తే మంచిదేమో!!

ఇక ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు ఎంతో ఆసక్తికర సమాధానాలు చెప్పింది చిత్ర బృందం. ముఖ్యంగా హరీష్ శంకర్ ఈ సినిమాలో రవితేజకు రొమాన్స్ ఎక్కువయింది అని అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే విధంగా సమాధానం చెప్పారు ఈ దర్శకుడు. వాస్తవానికి గత కొన్ని సినిమాల్లో రవితేజ తన సినిమాలలో ఎక్కువ మోతాదులో రొమాన్స్ ను పెడుతున్నారు. అయితే ఈ వయసులో ఇంతటి రొమాన్స్ చేయడం అవసరమా అని వేలెత్తి చూపుతున్న సమయంలో హరీష్ శంకర్ సరైన సమాధానం ఇచ్చాడు.

ఈ సినిమాలోని హీరోయిన్ అన్ని షరతులకు ఒప్పుకున్న తర్వాతనే సంతకం పెట్టిందని, ఆమెకు లేని బాధ మీ అందరికీ ఎందుకని ఆయ అన్నారు. ఇలాంటి సీన్ లు ఉంటాయి అని అందరికీ ముందే తెలుసని అలాంటి వాటికి ఒప్పుకున్న తర్వాతనే అలాంటి సీన్స్ చేశామని వెల్లడించారు. ఏదేమైనా దర్శకుడు హరిశంకర్ ఇటీవల మీడియా పట్ల వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతుంది ఇది చిత్రంపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అనేది చూడాలి.