Talking on the phone with ex wife in the middle of the night Sumanth

Sumanth: అక్కినేని సుమంత్ మాజీ భార్య కాపురంలో చిచ్చు పెడుతున్నారా.. అసలు విడాకులు తీసుకున్నాక మాజీ భార్యతో ఆయనకేంటి సంబంధం.. అసలు మాజీ భార్య జీవితంలోకి మళ్లీ ఎందుకు తొంగి చూస్తున్నాడు.. అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకొని ఎన్నో సినిమాల్లో నటించారు.

Talking on the phone with ex wife in the middle of the night Sumanth

ఈయన నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో హిట్ అయ్యాయి.ముఖ్యంగా సత్యం, గోదావరి, యువకుడు, స్నేహమంటే ఇదేరా, గోల్కొండ హై స్కూల్, సుబ్రహ్మణ్యపురం వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరోయిన్ కీర్తి రెడ్డితో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి ప్రేమ పెళ్లి ఎన్నో రోజులు నిలవలేదు. కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.(Sumanth)

Also Read: Kamal Haasan: హోటల్ రూమ్లో హీరోయిన్ తో కమల్ హాసన్ ఎంజాయ్.. బయట భార్య రచ్చ..అదో పెద్ద స్టోరీ.?

ఇక విడాకుల తర్వాత కీర్తి రెడ్డి మరో పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే సుమంత్ మాత్రం పెళ్లికి దూరంగా ఉన్నారు. అసలు జీవితంలో పెళ్లి కూడా చేసుకోను అంటూ తెగేసి చెబుతున్నారు. అయితే కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చినప్పటికి కూడా ఆమె కుటుంబ సభ్యులు సుమంత్ ని తమ ఇంట్లో అల్లుడికి ఎలా రెస్పెక్ట్ ఇస్తారో అలాగే చూస్తారట. అంతేకాదు వారానికి ఒక్కసారైనా సరే కీర్తి రెడ్డికి సుమంత్ కాల్ చేసి మాట్లాడతారట. వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారట.

Talking on the phone with ex wife in the middle of the night Sumanth

అలాగే సుమంత్ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కీర్తి రెడ్డి, కీర్తి రెడ్డి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు సుమంత్ హాజరవుతూ ఉంటారట. అలా విడాకులు తీసుకున్నప్పటికీ ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం అంటూ ఓ ఇంటర్వ్యూలో సుమంత్ చెప్పారు. అయితే సుమంత్ మాటలు మీడియాలో వైరల్ అవ్వడంతో విడాకులు తీసుకున్నాక మళ్ళి మాజీ భార్యతో మాట్లాడటం ఏంటి.. ఒకవేళ ఈ మాటలు మరీ ఎక్కువైతే ఆమె కాపురంలో చిచ్చు పెట్టినట్టే..ఆమె భర్తకు తెలిస్తే ఊరుకుంటాడా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.. ఇక సుమంత్ ప్రస్తుతం హీరోగా అవకాశాలు తగ్గాక సీతారామం వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు.(Sumanth)