Tamannaah: తమన్నా భాటియా నిజంగానే తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిందా.. ఆ పెళ్లిలో ఎందుకు దూరం దూరంగా ఉన్నారు.. ఎందుకు ఈ జంట దూరమయ్యారు.. అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. రీసెంట్ గా దేశకుబేరుడు అయినటువంటి అంబానీ కొడుకు అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ ల పెళ్లికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలెబ్రెటీలు హాజరైన సంగతి మనకు తెలిసిందే.
Tamannaah who broke up with her boyfriend
బాలీవుడ్,టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా దేశ విదేశాల నుండి ఎంతోమంది అతిరథ మహారధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇలా ఎంతోమంది తరలివచ్చారు. అయితే వీరి పెళ్లి కంటే ఎక్కువగా కొంతమంది హీరో హీరోయిన్ల గురించే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే ఐశ్వర్యరాయ్ తన భర్త అత్త మామతో కాకుండా ఒంటరిగా తన కూతురితో రావడం. అలాగే జాన్వి కపూర్ కూడా ఒంటరిగా వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం.. (Tamannaah)
Also Read: Aishwarya Rai: సల్మాన్ కి దగ్గరవుతున్న ఐశ్వర్య రాయ్.. భర్తతో విడాకులు నిజమేనా..?
జాన్వీ కపూర్ లవర్ శిఖర్ పహారియా ఒంటరిగా వచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఇందులో మరో నటి తమన్నా భాటియా కూడా ఈ పెళ్లికి ఒంటరిగా వచ్చింది. అయితే విజయ్ వర్మ రాలేదా అంటే అదీ కాదు.ఆయన కూడా వచ్చారు. కానీ వీరిద్దరూ వేర్వేరుగా వచ్చారు.
అయితే వీరిద్దరూ బిజీగా ఉండడం వల్ల వేరువేరుగా వచ్చారు అనుకుంటే పెళ్లికి ఇద్దరు వచ్చాక నైనా కూడా కలిసి ఫొటోస్ దిగాచ్చు కానీ. అలా కూడా జరగలేదు. ఇద్దరు వేరువేరుగానే ఫోటోలు దిగారు. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకల్లో ఇద్దరు ఒక దగ్గర కూర్చుని కూడా కనిపించలేదు. అలాగే అంబానీ పెళ్లి వేడుకల్లో తమన్నా విజయ్ వర్మతో కాకుండా ఓ మిస్టరీ మ్యాన్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది దాంతో ఒక్కసారిగా వీరి మధ్య బ్రేకప్ జరిగింది అనే ఊహాగానాలు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి నిజంగానే ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారా.. ఎందుకు అంబానీ పెళ్లిలో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు అనేది తెలియాల్సి ఉంది.(Tamannaah)