TDP: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ముఖ్యంగా, అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. ఎంఎల్యేలు, మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు ఇలా అనేక మంది కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు, ఈ పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మార్చేస్తున్నాయి.
TDP Gaining Momentum with Teegala Krishna Reddy
అయితే ఈ క్రమంలో, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆయన ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకుని, తెలంగాణలో టీడీపీ పునరుద్ధరణపై తన ఆకాంక్షను వెల్లడించారు. ఎన్టీఆర్ తో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని గుర్తు చేస్తూ ఆయనను ప్రశంసించారు.
Also Read: BRS Party: గులాబీ దళానికి కొత్త నాయకుడు కావాలట.. ఎవరు మరీ?
తీగలతో పాటు, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు కూడా చంద్రబాబును కలిశారు. అయితే, వీరు మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిసారని తెలుస్తోంది.
ఇప్పటి వరకూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసిన తీగల, మళ్లీ టీడీపీలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం, ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. తెలంగాణలో టీడీపీ ఒకప్పుడు ప్రధాన పార్టీగా ఉండగా, ఇప్పుడు ఆ పార్టీ పునరుజ్జీవనాన్ని ఆశించే పరిస్థితిలో ఉంది.