Team India: టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంబరాలు ఇప్పటికీ పూర్తయ్యాయో లేదో కానీ అంతలోనే జింబాబ్వేలో మనవాళ్లు ఓడిపోయారు. జింబాబ్వే మీద ఐదు టీ20ల సిరీస్ కోసం హరారేలో ల్యాండ్ అయిన టీం ఇండియా ఫస్ట్ టీ20లో ఓడిపోయింది. టాస్ గెలిచి ధీమాగా బౌలింగ్ ఎంచుకున్న మన టీమ్ ఇండియా అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందని అనుకున్నారు. Team India
Team India defeated by Zimbabwe These are the 5 main reasons for the defeat
దానికి గల కారణం ….జింబాబ్వే బ్యాటర్లు అంత పెద్దగా ఆడింది లేదన్నట్టుగా కనబడ్డారు. స్కోర్ బోర్డు మీద 9 వికెట్ల నష్టానికి 115 పరుగులే పెట్టారు జింబాబ్వే ఆటగాళ్లు. జింబాబ్వేలో నలుగురు బ్యాటర్లు 20కి పైగా స్కోర్లు కొట్టారు. 29కి పైగా పరుగులు చేసిన క్లీవ్ మదాన్డే టాప్ స్కోరర్. భారత బౌలింగ్ లో రవి బిష్నోయ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. Team India
Also Read: Jasprit Bumrah: బుమ్రా కూడా రిటైర్మెంట్… షాక్ లో ఫ్యాన్స్ ?
సుందర్ 2, ఆవేష్ ఖాన్, ముఖేష్ చెరో వికెట్ తీశారు. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. కానీ 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బాధలే చూడాలి. అంత యంగ్ స్టార్సే అయినప్పటికీ జింబాబ్వేతో పోలిస్తే ఎంతో కొంత అనుభవం ఉన్న మన యంగ్ స్టార్లు జింబాబ్వే బౌలర్ల దాటికి బెంబేలెత్తిపోయారు. కెప్టెన్ గిల్ 31 పరుగులు చేయడం చివర్లో సుందర్ 27 పరుగులు ఆవేష్ ఖాన్ 16 పరుగులు చేయడం మినహా మిగిలిన వారంతా తక్కువ స్కోర్లే చేశారు. Team India
ఇంటర్నేషనల్ క్రికెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకునా ఐపీఎల్ లో అదరగొట్టినా అభిషేక్ శర్మ, రింకు సింగ్ లు డక్ అవుట్ కావడం…. ఋతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధృవ్ వంటి ప్రతిభవంతులు కూడా ఆదుకోలేకపోవడంతో టీమ్ ఇండియా 102 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. జింబాబ్వే బౌలర్లలో చతారా, కెప్టెన్ సికిందర్ రజా ఇద్దరు కూడా మూడేసి వికెట్లతో టీమ్ ఇండియానూ కుప్పకూల్చారు. ఇక రెండో టీ20 ఆదివారం రోజున జరగనుంది. Team India