Users Upset As Netflix Raises Subscription Prices

Netflix: ఈరోజుల్లో చాలా మంది థియేటర్లకి వెళ్లడం మానేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే ఓటిటి ద్వారా సినిమాలని చూస్తున్నారు. కొత్త సినిమాలు థియేటర్లోకి వచ్చిన నెల రెండు నెలల్లోనే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. దీంతో హ్యాపీగా ఇంట్లో కూర్చునే సినిమాలు చూస్తున్నారు. ఓటేయట వేదికగానే చాలా సినిమాలు సిరీస్ లు రూపొందుతున్నాయి.

Users Upset As Netflix Raises Subscription Prices

ఆఫర్ చేస్తున్న కంటెంట్ ఆధారంగా స్ట్రీమింగ్ కంపెనీలు ఎప్పటికప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్లు కూడా రూపొందిస్తున్నాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లకి డిమాండ్ బాగా పెరిగింది తాజాగా ప్రముఖ గ్లోబల్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల లో మార్పులు చేసింది ఇక వివరాలని చూసేద్దాము… ప్రముఖ గ్లోబల్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లలో మార్పులు చేయడం జరిగింది.

Also Read: KTR: ఎన్నికల కోడ్ కంటే ముందు కాంగ్రెస్ ఆరు హామీల మీద ఉత్తర్వులు జారీ చెయ్యాలి

కెనడా యునైటెడ్ కింగ్డమ్ లోని సబ్స్క్రిప్షన్లు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత దేశం లోని సబ్స్క్రైబర్ లపై కూడా కంపెనీ నిర్ణయం ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. బడ్జెట్ ధరలో అందిస్తున్న $11.99 (సుమారు రూ.962.59) నెలవారీ యాడ్‌-ఫ్రీ ప్లాన్‌ ని నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ చెప్పింది. ఇప్పుడు $15.99 ప్లాన్‌ (దాదాపు రూ.1,282.62) చౌకైన యాడ్-ఫ్రీ ఆప్షన్‌ గా మారింది. రెండు ప్లాన్‌ల మధ్య చాలా తేడా వుంది.

Users Upset As Netflix Raises Subscription Prices

వాలెట్-ఫ్రెండ్లీ కోరుకునే వాళ్లకు, నెట్‌ఫ్లిక్స్‌ యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను నెలకు కేవలం $6.99 (దాదాపు రూ.560.37)కి అందిస్తోంది. తక్కువ-ధర, యాడ్-సపోర్టెడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందేలా వ్యూవర్స్‌ను కంపెనీ ప్రోత్సహిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్ ధరను అక్టోబర్‌లో $22.99 (దాదాపు రూ.1,843.30)కి పెంచేసింది. సబ్‌స్క్రిప్షన్ మార్పులు చేస్తున్న క్రమంలోనే.. నెట్‌ఫ్లిక్స్ WWEతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏకంగా $5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.500 కోట్లు). ఈ ఒప్పందం తో WWE లైవ్ వీక్లీ రెజ్లింగ్ షో, మండే నైట్‌ రా ప్రసారం చేయడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రత్యే రైట్స్ ని కపొందింది. (Netflix)

Join WhatsApp