VI Offering Swiggy One Worth Rs 2500 for Free to Select Mobile Customers

VI: మనదేశంలో ఎక్కువగా రిలయన్స్ జియో సిమ్ బాగా మందు వాడతారు. ఆ తర్వాత ఎయిర్టెల్ వినియోగదారులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ మొదటి నుంచి వోడాఫోన్ ఐడియా వాడే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. సెంటిమెంట్ కోసం వోడాఫోన్ ఐడియా వాడుతారు కొంతమంది వినియోగదారులు. అయితే వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు తాజాగా కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.

VI Offering Swiggy One Worth Rs 2500 for Free to Select Mobile Customers

తమ కస్టమర్లకు ఏకంగా 2500 విలువైన స్విగ్గి వన్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది వోడాఫోన్ ఐడియా కంపెనీ. అయితే ఈ ఆఫర్ కేవలం పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా పోస్ట్ పెయిడ్ కస్టమర్లలో… మాక్స్ ప్లాన్ రీఛార్జ్ చేస్తేనే… ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

Also Read: Asus: OLED టచ్‌ డిస్‌ప్లేతో ఆసుస్ ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్లు ఇవే..!

అంటే పోస్ట్ పెయిడ్ కస్టమర్లు 501 రూపాయల రీఛార్జ్ కంటే ఎక్కువ రీఛార్జి చేసుకుంటే… ఈ స్విగ్గి ఆఫర్ వర్తిస్తుంది. 501,701,1101,1001 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపింది వోడాఫోన్ ఐడియా కంపెనీ. అంతేకాకుండా పై ఆఫర్లతో రీఛార్జి చేసుకుంటే హాట్ స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ కూడా మనకు ఫ్రీగా వస్తది. ఇక లేటెస్ట్ గా ఈ ఆఫర్ కు స్విగ్గి వన్ నెంబర్ షిప్ ఆఫర్ ను అందిస్తోంది కంపెనీ.

స్విగ్గి వన్ నెంబర్ షిప్ ఆఫర్ ప్రకారం… 149 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ఫుడ్ మనం ఆర్డర్ చేస్తే… డెలివరీ చార్జెస్ మనకు పడవు. అలాగే 30 వేలకు పైగా ఉన్న రెస్టారెంట్లలో ఏకంగా మనం 30% డిస్కౌంట్ ఈ ఆఫర్ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా ప్రతి నెలకు 150 రూపాయల విలువైన రెండు రూపంలో మనకు swiggy ద్వారా వస్తాయి. (VI)

Join WhatsApp