Xiaomi 14 Ultra: New phone from Xiaomi

Xiaomi 14 Ultra: ప్రస్తుత మొబైల్ మార్కెట్ లో షావోమి కంపెనీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అనేక మొబైల్స్ రిలీజ్ అయి దూసుకు పోతున్నాయి. ఇదే తరుణంలో షాఓమీ 14 అల్ట్రా త్వరలో లాంచ్ కు సిద్ధంగా ఉంది. రిలీజ్ కు ముందే కొన్ని కీలకమైనటువంటి ఫీచర్లు లీక్ అయ్యాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Xiaomi 14 Ultra: New phone from Xiaomi

షావోమి మొబైల్ ఫిబ్రవరి 26 నుంచి 29 బార్సిలోనాలో జరిగేటువంటి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది లాంచ్ కు ముందే కొన్ని స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.. షావోమీ 14 ఆల్ట్రా ప్రధాన కెమెరా విషయానికి వస్తే f/1.63, f/4.0 మధ్య ఉండే వేరియబుల్ ఎపర్చరుకు సపోర్ట్ ఇస్తుందని టీప్ స్టార్ తెలియజేసింది.(Xiaomi 14 Ultra)

Also Read: Cult Sport Ace X1: సరికొత్త స్మార్ట్ వాచ్.ధర కూడా తక్కువే..!

అంతే కాకుండా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 3 ఎస్ ఓసి, 120HZ రిఫ్రిజిరేట్ 6.7 అంగుళాల ,2k అమౌల్డ్ స్క్రీన్, 90 డబ్ల్యూ వైర్డ్,50 డబ్ల్యూ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో 5,180ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. అంతేకాకుండా అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది.

Xiaomi 14 Ultra: New phone from Xiaomi..

మిగిలిన షావోమీ 14 హ్యాండ్ సెట లాగానే అల్ట్రా మోడ్ ఆండ్రాయిడ్ 14 పైన కూడా ఈ కంపెనీ కొత్త హైపర్ ఓఎస్ స్కిన్ తో రాబోతోంది. మూడు 50 ఎంపీ ఐఎమ్ఎక్స్ 858 సెన్సార్లు కలిగిన లైకా ట్యూన్డ్ క్వాడ్ రియర్ కెమెరా సిస్టంతో పాటు షావోమీ 13 అల్ట్రా 50 mp ఒక అంగుళాల ఐఎమ్ఎక్స్ 989 ప్రైమరీ సెన్సార్ కూడా వస్తోంది. అలాగే ఈ హ్యాండ్ సెట్ ముందు కెమెరా 32 mp సెన్సార్ ను ఉపయోగిస్తుంది.(Xiaomi 14 Ultra)

Join WhatsApp