BJP: తెలంగాణ బిజెపిలో గత కొన్ని రోజులుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యేల మధ్య అసలు… సఖ్యత ఇక్కడ కనిపించడం లేదు. ఒకరి మాట ఒకరు వినడం లేదు. అసెంబ్లీలో కూడా ఇదే స్పష్టంగా మనకు అర్థమైంది. కిషన్ రెడ్డి మీటింగ్ పెడితే మహేశ్వర్ రెడ్డి లాంటి కీలక నేతలు కూడా రావడం లేదు. అటు బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య కూడా కోల్డ్ వార్ కొనసాగుతోందట. BJP
Telangana BJP Leaders Cold War
అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ బిజెపి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ ఎందుకు అధికారంలోకి రావడం లేదని నిలదీశారు. దీని వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని పరోక్షంగా ఆయన కామెంట్స్ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. హైదరాబాద్ పరిధిలో 48 కార్పొరేటర్లను గెలుచుకున్న బిజెపి… ఒక్క ఎమ్మెల్యే ని కూడా ఎందుకు గెలుచుకోలేదని ప్రశ్నించారు. BJP
Also Read: Revanth Reddy: రేవంత్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చిన మూసీ వాసులు!
అధికారంలోకి వస్తామని అందరూ అనుకుంటే ఎనిమిది ఎమ్మెల్యే సీట్లే ఎందుకు వచ్చాయని కూడా ఆయన నిలదీయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసిన వారు అసెంబ్లీలో ఎందుకు వేయడం లేదని కూడా ప్రశ్నించడం జరిగింది. బిజెపి అధికారంలోకి వస్తే ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలో నాకు తెలుసు అంటూ హెచ్చరించారు. ఈ అంశాలపై బీజేపీ అధిష్టానం ఆలోచన చేయాలని కూడా డిమాండ్ చేశారు. BJP