Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడారన్న వార్త దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం జాతీయ వ్యాప్తంగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం వేపుతోంది. ఈ తరుణంలోనే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ కీలక ప్రకటన చేసింది. Tirumala Laddu
Telangana Vijaya Dairy Offer TO Tirumala
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరాఫరా చేయడానికి విజయ డెయిరీ సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది. ఈ మేరకు టీటీడీ జీవో జె. శ్యామలరావుకు లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను అందించినట్లు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులరంగంలో తెలంగాణ విజయ డెయిరీ ప్రసిద్ధి చెందిందని ఆ లేఖలో తెలియజేశారు. Tirumala Laddu
Also Read: Hyderabad: 42 శాతం పడిపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ?
వినియోగదారులకు నాణ్యమైన, విలువైన ఉత్పత్తులు సరాఫరా చేసిన చరిత్ర విజయ డెయిరీకి ఉంది. విజయ డెయిరీ ఉత్పత్తుల్లో నాణ్యత బాగుంటుందని తెలిపారు. లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ ఉపయోగంగా ఉంది అన్నారు. టీటీడీకి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని తెలపడం జరిగింది. Tirumala Laddu