Bigg Boss beauty: బిగ్బాస్ షో తో చాలామంది గుర్తింపును తెచ్చుకున్నారు. బిగ్ బాస్ లో యాంకర్ గా నాగార్జున చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు పూర్తికాగా త్వరలో 8 వ సీజన్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే పలువురు పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెట్టింది. ప్రియుడిని కూడా పరిచయం చేసేసింది.
ఇంతకీ ఎవరతడు? రామ్ గోపాల్ వర్మతో ఓ వీడియోలో కనిపించిన ఇనయా అప్పట్లో వైరల్ అయింది. అలా బిగ్ బాస్ 6 వ సీజన్లో అడుగుపెట్టింది. ఉన్నంతలో పర్వాలేదనిపించే ఫెర్ఫార్మెన్స్ చేసింది. షో అయిపోయిన తరువాత ఆమెకు పెద్దగా సినిమా చాన్సులు రాలేదు. దీంతో హాట్ హాట్ ఫోటోలో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ ని ఎంటర్ డైన్ చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఇనయా..ఓ వ్యక్తితో కలిసి క్లోజ్ గా కనిపించింది.
తాజాగా అతడితోనే బాత్రూంలో టవల్ కట్టుకుని మరి సెల్ఫీలకు పోజులిచ్చింది. దీని కింద బిగ్ బాస్ ఓటిటిలో పాల్గొన్నారు కామెంట్స్ చేయగా.. ఇనయా తన ప్రేమ నిజమేనని క్లారిటీ ఇచ్చేసింది. ఇనయా బాయ్ ఫ్రెండ్ విషయానికొస్తే ఇతడి పేరు గౌతమ్ గోప్పిశెట్టి. యోగా డ్రైనర్, జియ్ కోచ్ అని ఇన్ స్టాలోని బయో బట్టి తెలుస్తోంది. గతంలో జిమ్ లో వీళ్ల ప్రేమ వ్యవహారం మొదలై, రిలేషన్ షిప్ వరకు వచ్చిందని తెలుస్తోంది. రొమాంటిక్ పోజులు చూస్తుంటే త్వరలో పెళ్లి చేసేసుకుంటారేమో అనిపిస్తోంది.