Aishwarya Rai: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ ఎంత పెద్ద హీరోయినో మాటల్లో వర్ణించలేం. అయితే అలాంటి ఈ హీరోయిన్ ని ఓ తెలుగు హీరో చాలా దారుణంగా అవమానించారట. ఐరన్ లెగ్ అంటూ ఘోరాతి ఘోరంగా అవమానించారట. మరి ఇంతకీ ఐశ్వరరాయ్ ని అంత పెద్ద మాట అని అవమానించిన హీరో ఎవరు? ఎందుకు అలాంటి మాట అనాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. కొంతమంది హీరో హీరోయిన్లు నటించిన మొదటి రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరో హీరోయిన్లకి ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది.
Telugu hero insulted by Aishwarya Rai
అయితే ఇప్పటికే మన ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకొని ఆ తర్వాత స్టార్ హీరో హీరోయిన్స్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. అయితే అప్పట్లో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ నటించిన వరుస సినిమాలు కూడా ప్లాఫ్ అవడంతో ఆమెపై ఓ హీరో ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేశారట.ఇక ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్.. వెంకీ ఐశ్వర్యారాయ్ ని అంత పెద్ద మాట ఎందుకు అన్నారంటే..(Aishwarya Rai)
Also Read: Lavanya: అందరి ముందే ఆయన్ని చెప్పుతో కొట్టిన లావణ్య..?
అప్పట్లో వెంకటేష్ ఎన్నో ప్రేమ కథా,యాక్షన్, కుటుంబ కథా సినిమాల్లో నటించారు. అలా వచ్చిన మూవీనే ప్రేమంటే ఇదేరా. అయితే ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ ని హీరోయిన్ గా అనుకున్నారట మూవీ యూనిట్.కానీ ఈ హీరోయిన్ ని సినిమాలో తీసుకుంటున్నారు అని తెలిసిన వెంకటేష్ ఐశ్వర్య వద్దు. ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. ఆమె ఓ ఐరన్ లెగ్ నటి. మన సినిమాలో తీసుకుంటే మన సినిమా కూడా మటాష్ అంటూ షాకింగ్ కామెంట్లు చేశారట.
అయితే ఆ హీరోయిన్ ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చింది. భవిష్యత్తులో స్టార్ అవుతుంది. మన సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుంది అని చిత్ర యూనిట్ చెప్పినా కూడా వెంకటేష్ వినకుండా వేరే హీరోయిన్ ని పెట్టమన్నారట.దాంతో చేసేదేమీ లేక ఐశ్వరరాయ్ ని కాకుండా ప్రీతి జింతాని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే అప్పట్లో వెంకటేష్ ఐశ్వర్యరాయ్ ని ఐరన్ లెగ్ అన్నారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వైరల్ అయింది.(Aishwarya Rai)