TG Vishwa Prasad: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కీలక లీడర్ గా ఉన్నారు.జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ప్రజల్లోనే ఉంటూ ప్రజల అవసరాలు, బాధలు, సమస్యలు అన్నీ తెలుసుకుంటూ ప్రజల తరఫున కొట్లాడారు. దాంతో ఆయనకు జనాల్లో సింపతి బాగా పెరిగిపోయింది.అయితే ఒక్కడినే జగన్ ను ఎదుర్కోలేనని అనుకున్నారో ఏమో తెలియదు గానీ టిడిపి తో పొత్తు పెట్టుకున్నారు.
TG Vishwa Prasad is impressing Pawan
అది చాలదు అన్నట్లు బిజెపిని కూడా టిడిపి కూటమిలో భాగం చేసి బిజెపి కోసం తనకి ఉన్న అరకొర సీట్లను కూడా త్యాగం చేసేసారు. కానీ ఇచ్చిన సీట్లన్నింటిలో గెలిచి చూపించి 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గెలుపు రాజకీయాల్లో,ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాదు ఫిలిం ఇండస్ట్రీ వాళ్లకు కూడా ఎంతో గర్వకారణం.(TG Vishwa Prasad)
Also Read: Tollywood: సినిమాల్లో నటించాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్.. పోస్ట్ వైరల్..!
అలాగే మెగా ఫ్యామిలీకి కూడా పవన్ కళ్యాణ్ గెలుపుతో మరింత గౌరవం, మర్యాదలు పెరిగాయి. అయితే పవన్ కళ్యాణ్ గెలుపుతో టాలీవుడ్ లోని ఓ స్టార్ నిర్మాత గ్రాండ్ గా పార్టీని ఇస్తున్నారట.. మీడియా మిత్రులు, రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇలా దాదాపు 2000 మందికి కలిపి ఈయన హైదరాబాదులోని గచ్చిబౌలి లో ఉండే ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నారట పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
అయితే ఈ రోజే అంటే ఆదివారం రోజే ఈ పార్టీ గ్రాండ్గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో అంతమంది సినీ పెద్దలు ఉన్నప్పటికీ కూడా టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ మీద అభిమానుంతో లక్షలు ఖర్చు చేసి ఈ పార్టీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.(TG Vishwa Prasad)