నటీనటులు: విక్రమ్, పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, డేనియల్ కల్టగిరోన్ తదితరులు (Thangalaan)
సినిమాటోగ్రఫీ: ఏ కిషోర్ కుమార్
ఎడిటర్ : సెల్వ ఆర్ కే
మ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: జ్ఞానవేల్ రాజా
దర్శకుడు : పా రంజిత్
విడుదల తేదీ : 15 ఆగస్టు 2024
Thangalaan Review: A Unique Blend of History and Action
పలు సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులనూ ఎంతగానో ఆకట్టుకున్న హీరో విక్రమ్ తాజాగా పారంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ అనే చిత్రం చేశాడు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా అప్డేట్ ఇప్పటికే ప్రేక్షకులను అలరించగా సినిమా పై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, డేనియల్ కల్టగిరోన్ తదితరులు నటించిన ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను మెప్పించిందో తెలియాలంటే ఈ సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
కథ: తంగలాన్ (విక్రమ్) తన భార్య గంగమ్మ (పార్వతీ తిరువోతు)తో పాటు తన పిల్లలతో లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. అయితే, అప్పటి బ్రిటిష్ పాలకుల అధికారం కారణంగా తంగలాన్ తన భూమిని కోల్పోవాల్సి వస్తోంది. తనతో పాటు తన కుటుంబం మొత్తం బానిసలుగా మారాల్సి వస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో బంగారం (‘కోలార్ గోల్డ్ ఫిల్డ్స్ లో’) వెతికి పెట్టమని బ్రిటిష్ దొర తంగలాన్ కి సంబంధించిన తెగ దగ్గరకు వస్తాడు. ఐతే, ఆ బంగారు గనులకి కాపాలా కాస్తున్న ఆరతి (మాళవిక మోహనన్) నుంచి పెద్ద ప్రమాదాలు ఎదురు అవుతాయి. మరి ఆరతి నుంచి తప్పించుకుని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడా ?, అసలు తంగలాన్ ఎవరు ?, అరణ్య (విక్రమ్) ఎవరు ? అతనికి ఆరతికి మధ్య సంబంధం ఏమిటి ?, చివరకు తంగలాన్ ఏ నిజం తెలుసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.
Also Read: Raviteja: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ!!
నటీనటులు: తన ప్రతి సినిమాలో పాత్రకు తగ్గట్లుగా బాడీని మేకోవర్ చేసే హీరోలలో విక్రమ్ ముందుంటారు.అలా ఇప్పుడు పా రంజిత్ దర్శకత్వంలోని “తంగలాన్” సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ మార్చేశాడు విక్రమ్. ఈ సినిమా మొదటి లుక్ విడుదలైనప్పటి నుండి సినిమా పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. తెలుగు లో సైతం విక్రమ్ కి అభిమానులున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం వారు కూడా ఎదురుచూడసాగారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే తంగళన్ పాత్రలో విక్రమ్ నటన అందరికి నచ్చేసింది. ఈ పాత్రను విక్రమ్ తప్ప ఎవరూ చేయలేరు అన్న రేంజ్ లో నటించాడు. అలాగే మాళవిక మోహనన్ ఆర్తి పాత్ర లో నటించిన తీరు బాగుంది. గిరిజన వేషధారణలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలలో ఆమె నటించిన విధానం ప్రతి ఒక్కరిని మెప్పించింది.ఇక తంగళన్ భార్యగా పార్వతి తిరువోతు బాగా నటించింది. మిగితా నటీనటులు కూడా బాగా నటించారు.
సాంకేతిక నిపుణులు: కబలి సినిమా తో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్నాడు దర్శకుడు పా రంజిత్. చాల రోజుల తర్వాత అయన చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేలా చేశాడు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలను రాయడంలో మరోసారి తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఆయన రూపొందించిన ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటాయి. కథ దగ్గరినుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమా కోసం బాగా పనిచేసింది. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్. కెమెరా పనితనం ప్రత్యేక ఆకర్షణ. ఎడిటింగ్ కూడా బాగుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తేనే డబ్బులొస్తున్నా ఈ రోజుల్లో ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
విక్రమ్ నటన
కథ, స్క్రీన్ ప్లే
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
కొన్ని చోట్ల సాగతీత సీన్స్
తీర్పు: ప్రస్తుతం ఉన్న మూసధోరణి సినిమాలు చూసి అలిసిపోయినవారికి ‘తంగలాన్’ మంచి ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ సినిమా సరిగ్గా సరిపోతుంది. విక్రమ్ నటన సినిమాకే హైలైట్ కాగా పా రంజిత్ కథ కథనాలు చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు ప్రేక్షకులను నచ్చుతాయి.
రేటింగ్ : 3/5